Thursday, February 9, 2017

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్చ నిర్వహించకుండానే ఆర్‌టిఎ ఫీజులు, జరిమానాలను పెంచడం
చలానాలు, ఫీజులను ఉపసంహరించకపోతే రవాణా రంగం బంద్‌

Thursday, October 13, 2016

JASUVA KALA VEDIKA VIJAYAWADA

నయ వంచన

సైన్యంలో విధి నిర్వహణ అంటే కత్తిమీదసామేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కఠోరమైన శిక్షణ, అనునిత్యం ప్రమాదాలకు ఎదురీదడం, భిన్న వాతావరణ పరిస్థితుల్లో పని చేయాల్సి రావడం సైనిక విధుల్లో తప్పనిసరి! యుద్ధం ఉన్నా లేకున్నా ప్రతిక్షణం అన్ని విధాలా అప్రమత్తంగా ఉండటం, దానికి అవసరమైన శిక్షణ పొందడం అనివార్యం! ఈ క్రమంలో గాయపడటం కూడా సహజమే! తీవ్రంగా గాయపడిన సందర్భాల్లో విధుల నుండి తప్పుకోవాల్సి కూడా రావచ్చు. అటువంటి వారి భావి జీవితానికి భరోసా కల్పించేందుకు ఇస్తున్న పింఛన్లపై మోడీ సర్కారు కత్తి కట్టిన తీరు దుర్మార్గం! గాయపడిన సైనికుడు చివరిసారి అందుకున్న జీతాన్ని ప్రామాణికంగా తీసుకున్న పర్సంటేజి ప్రాతిపదికన పింఛనును, 2006లో ఏర్పాటైన ఆరో కేంద్ర వేతన సంఘం సిఫార్సు మేరకు నిర్ణయించేవారు. ఈ విధానంతో దాదాపుగా చివరి జీతానికి సమానమైన మొత్తం అంగవైకల్య పింఛనుగా అందేది. తాజా నోటిఫికేషన్‌లో ఈ పర్సంటేజి విధానానికి స్వస్తి పలికిన కేంద్రం దానికి బదులుగా శ్లాబ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. నూతన విధానం ప్రకారం కనిష్టంగా 18 వేల రూపాయల నుండి గరిష్టంగా 70 వేల రూపాయల వరకు వికలాంగులైన సైనికులు కోల్పోనున్నారు. సాధారణ పౌర ఉద్యోగులు విధి నిర్వహణలో వికలాంగులైతే అందే పింఛను కన్నా తమకు తక్కువ రానుందని తేలడం కూడా సైన్యంలో తీవ్ర స్థాయి చర్చకు, నిరసనకు కారణం. ఉత్తర్వులు కాకుండా నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కూడా సైనిక వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సర్వీసు నిబంధనల ప్రకారం సైనికులు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడలేకపోవచ్చు. ఇతర ఉద్యోగుల తరహాలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టకపోవచ్చు. కానీ, సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అయితే, ఈ దిశలో చర్యలు తీసుకోవడానికి కేంద్ర సర్కారు సుముఖంగా ఉన్న సంకేతాలేమీ కనపడటం లేదు. సైన్యంలో గగ్గోలు ప్రారంభమైన తరువాత కూడా ప్రధాన మంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ ఈ విషయమై స్పందించక పోవడమే వారి వైఖరిని తేటతెల్లం చేస్తోంది. రక్షణ శాఖ కార్యాలయ వర్గాలు అనధికారికంగా ఏమి చెప్పినప్పటికీ వాటికి అధికారిక ముద్ర లేదు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైనికుల పేరు చెప్పి కాయలేరుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్న మోడీ ప్రభుత్వం ఆచరణలో సైనికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ఈ పింఛన్ల కుదింపు వ్యవహారమే నిదర్శనం. ఒకే ర్యాంకు ఒకే పింఛను విధానం కోసం ఉద్యోగ విరమణ చేసిన, సైనికులు చేస్తున్న ఆందోళనలపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించ లేదు. సైనికుల మీద, వారి సంక్షేమం మీదా మోడీ సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తక్షణం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి. సైనికుల మనోస్థైర్యం పెంపొందించేలా ప్రకటన చేయాలి. గుట్టుచప్పుడు కాకుండా నోటిఫికేషన్‌ ఎందుకు జారీ చేశారో జాతికి వివరణ ఇవ్వాలి. దేశమంటే మట్టి కాదు... మనుష్యులు! ఆ మనుష్యుల్లో సరిహద్దులో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించే సైనికులు కూడా ఉన్నారు. వారికి జరుగుతున్న అన్యాయంపై స్పందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

Thursday, September 29, 2016

ఎవరైనా కాదనేవాళ్ళు ముందుకు రండి?
అమరావతి నిర్మాణంలో ఆధారాలతో బట్టబయలైన కుంభకోణం విలువ – కనీసం 550 కోట్లు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని వెనక్కి నెట్టి కేవలం రెండేళ్లలో అవినీతిలో మన రాష్ట్రం నెంబర వన్ ఎలా అయిందో తెలుసు కోవాలనుందా! అయితే జాగ్రత్తగా ఈ కుంభకోణం గురించి చదవండి.
కట్టేది తాత్కాలిక రాజధాని అయినా, దోపిడీ మాత్రం నిత్య నూతనంగా, బరితెగింపుకి పరాకాష్టగా జరుగుతుంది. తాత్కాలిక రాజధాని నిర్మాణం ఆలోచన వచ్చినప్పటి నుండి, స్థలాలని ఎంపిక వరకు, కాంట్రాక్టర్లని నిర్ణయించటం నుండి నిధుల విడుదల వరకు మొత్తం అవినీతి మయం. సర్వం బినామీ కంపనీలకి దోచి పెడుతున్న వైనం మీరే చూడండి.