కో అంటే...కోటి
న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీలు కదం తొక్కుతుండటంతో వేతన మార్కెట్‌లో కోటి రూకల వాన కురుస్తోంది. ఇప్పటివరకూ ముకేష్ అంబానీతో సహా మొత్తం 30 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కోటి రూపాయల జీతగాళ్లుగా ఖ్యాతి గడించారు. టాప్ బాసులకు చెల్లించిన జీతాల వివరాలను 32 కంపెనీలు ప్రకటిస్తే.. ఇందులో 12 కంపెనీల నుంచి 30 మంది కోటి రూపాయలకు పైగా వేతన ప్యాకేజీలతో సంచలనం సృష్టించారు. గత ఏడాది 459 కంపెనీలు కోటి రూపాయలకు మించిన జీతాన్ని తమ ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించినట్లు ప్రకటించాయి. మొత్తం 800 ఎగ్జిక్యూటివ్‌లు కోటి రూపాయల క్లబ్బులో స్థానం సంపాదించారు. ఈసారి సంఖ్య మరింత పెరగవచ్చని ప్రముఖ ఆర్థిక గణాంక సంస్థ క్యాపిటల్ లైన్ అంటోంది. ఇప్పటివరకూ వేతన ప్యాకేజీల వివరాలను ప్రకటించిన కంపెనీలు గతంతో పోల్చితే చాలా తక్కువ. త్వరలోనే మిగతా కంపెనీల వివరాలూ అందుతాయని, ఈసారి కోట్లకు పడగలెత్తిన ఉద్యోగుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.
ఇప్పటివరకూ అంబానీయే టాప్..
అందుబాటులోకి వచ్చిన తాజా సమాచారం ప్రకారం కోటి రూపాయల వేతన క్లబ్బులో ముకేష్ అంబానీయే ప్రథమ స్థానంలో నిలిచారు. అంబానీ వార్షిక వేతనం 15 కోట్ల రూపాయలు. గత ఏడాది అత్యధికంగా 37.08 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో సన్ టివి అధినేత కళానిధి మారన్ గరిష్ట వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా సంచలనం సృష్టించారు. నిజానికి అంబానీ 2007-08లోనే 44 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో తన జీతాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇటీవలే పదిహేను కోట్ల రూపాయలకు మించి వేతనాన్ని తీసుకోరాదని నిర్ణయించారు. అందుకే 2009-10 టాప్ టెన్ హయ్యెస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో అంబానీ లేకపోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ మారింది. ఎంత జీతం తీసుకుంటే అంత గొప్ప అన్న ధోరణి ప్రబలడంతో ఈ ఏడాది కార్పొరేట్ కోటి రూపాయల జీతగాళ్ల సంఖ్య వెయ్యికి పైగా ఉంటారని క్యాపిటల్ లైన్ అంటోంది.
కోటి రూకల జీతగాళ్లు..

No comments:
Post a Comment