2007, మే : టెలికాం శాఖ మంత్రిగా రాజా బాధ్యతలు చేపట్టాక ఆగస్టులో యూనివర్శల్ యాక్సిస్ సర్వీస్ (యుఎఎస్)తో పాటు 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల ప్రక్రియను ప్రారంభించారు.
నవంబర్ 22 : స్పెక్ట్రమ్ కేటాయించడానికి అనుసరిస్తున్న పద్ధతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ టెలికాం మంత్రిత్వ శాఖ (డాట్)కు ఆర్థిక శాఖ లేఖ రాసింది. దీనిపై సమీక్షించాలన్న డిమాండ్‌ను డాట్ తిరస్కరించింది.
2008, ఫిబ్రవరి 28 : ఈ వ్యవహారంలో రూ.1.70 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతున్నట్లు పేర్కొంటూ సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి ప్రధానికి లేఖ రాశారు.
జూన్ 10 : లైసెన్సులు మంజూరు చేయడానికి ముందొచ్చిన వారికి ముందుగా అన్న పద్ధతిని అనుసరించాలని డాట్ నిర్ణయించింది. దీంతోపాటు కటాఫ్ తేదీనీ 2007, అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 25కు తగ్గించింది. ఈ విధానం ద్వారా లైసెన్సులు మంజూరు చేయడానికి ఈ తేదీని మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల మధ్య ఎవరైతే దరఖాస్తులు దాఖలు చేస్తారో వారికి లైసెన్సులు మంజూరు చేస్తామని ప్రకటిస్తూ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
2009, మే 4 : స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ఒక స్వచ్ఛంద సంస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి)లో ఫిర్యాదు దాఖలు చేసింది. 2009, మే 14న అరుణ్ అగర్వాల్ అనే వ్యక్తి కూడా ఈ విషయంపై సివిసికి ఫిర్యాదు చేశారు.
2009 : ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సిబిఐ అధికారులను సివిసి ఆదేశించింది.
అక్టోబర్ 21 : సిబిఐ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజే డాట్ కార్యాలయాలపై దాడులు చేసింది.
సెప్టెంబర్ 13 : స్పెక్ట్రమ్ లైసెన్సులు మంజూరు చేయడంలో రూ.70 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సిపిఐఎల్ అనే సంస్థతోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని, రాజాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
అక్టోబర్ 8 : కాగ్ నివేదికపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. 21వ తేదీన కాగ్ ముసాయిదా నివేదిక కోర్టుకు వచ్చింది.
అక్టోబర్ 29 : ఈ కుంభకోణంపై దర్యాప్తు నెమ్మదిగా ఉందంటూ సిబిఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నవంబర్ 10 : ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందని ప్రభుత్వానికి కాగ్ నివేదిక ఇచ్చింది.
నవంబర్ 14 : మంత్రి పదవికి రాజా రాజీనామా చేశారు. మరుసటి రోజున కపిల్ సిబల్‌కు ప్రధాని ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు.
నవంబర్ 25 : రాజాను విచారించకపోవడంపై సిబిఐపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది.
డిసెంబర్ 8 : ఈ దర్యాప్తు పరిధిని 2001 నుంచి ప్రారంభించడానికి సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది.
2011, జనవరి 10 : ఈ పిల్‌పై కోర్టు స్పందిస్తూ కేంద్రానికి, మరో 11 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 2 : రాజా, డాట్ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహురా, రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్‌కె చందోలియాను అరెస్టు చేశారు.
ఫిబ్రవరి 8 : స్వాన్ టెలికాం శాఖ కార్యదర్శి షాహిద్ బల్వాను సిబిఐ అరెస్టు చేసింది.
ఏప్రిల్ 2 : సిబిఐ తొలి చార్జిషీట్, 25న రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కనిమొళి, శరద్‌కుమార్, కరీమ్ మోరాణికి సమన్లు జారీ చేసింది.
మే 6 : కోర్టుకు హాజరైన కనిమొళి, శరద్‌కుమార్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
No comments:
Post a Comment