2011 జులై 1 నుండి 15 వరకు జరిగిన పక్షం రోజుల్లో ఫార్వర్డ్ ట్రేడింగ్ రు. 7,05.007.23 కోట్లకు పెరిగిందని ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రు.4,15, 215.65 కోట్లు ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే 60 శాతం పెరిగిందన్నమాట. 2011 ఏప్రిల్ ఒకటి నుండి జులై 15 వరకు మొత్తం రు.45, 34,237.88 కోట్ల వర్తకం జరిగింది. 2010లో ఇదే కాలంలో ఇది రు. 28, 71, 202.91 కోట్లు అంటే 64 శాతం పెరిగింది. ఇందులో ఆహారధాన్యాల వర్తకం జులై 15తో అంతమైన పక్షం రోజుల్లో రు.90,896.89 కోట్లు. 2010లో ఇదే కాలంలో ఈ వర్తకం రు. 49,127.86 కోట్లు ఉంది. అంటే 85 శాతానికి పైగా పెరిగిందన్నమాట. సట్టా వ్యాపారం ఇంత భారీ స్థాయిలో పెరగడం ధరలు భారీగా పెరగడానికి దోహదం చేస్తుంది. ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఈ వ్యాపారం లాభాలను అర్జించిపెడుతుంది.
No comments:
Post a Comment