యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా ఆస్తులు కళ్లముందు కరిగిపోతున్నాయి. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ప్రకటించిన గణాంకాలే దీన్ని రుజువు చేస్తున్నాయి. 2010లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో 1.45 బిలియన్ డాలర్లతో 44వ స్థానంలో ఉన్న మాల్యా 2011కి వచ్చే సరికి 1.1 బిలియన్ డాలర్లతో 49వ స్థానంలో చేరుకున్నారు. ప్రతి ఏడాది ఆస్తులు తగ్గుతుండడంతో జాబితాలో ఆయన స్థానం గత మూడు సంవత్సరాలుగా పడిపోతూ వస్తోంది.
ఆయన ఆస్తులు విలువ క్రమంగా క్షీణించి పోవడానికి ప్రధాన కారణం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ నష్టాలేనని తెలుస్తోంది. నిర్వహణా వ్యయం పెరగడంతో నష్టాల పాలైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో వాటాలను ప్రమోటర్లు విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో యూబీ గ్రూపు నికర ఆస్తుల విలువ తగ్గిపోతోంది.
ప్రస్తుతం మార్కెట్ మొత్తం విలువలో గత ఏడాది కాలంలో రూ.21,800 కోట్ల (44.4 బిలియన్ డాలర్లు)కు తగ్గిపోయిందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రూప్ భాగస్వామ్య సంస్థలైన కింగ్‌ఫిషర్, యూబీ హోల్డింగ్స్, యునైటెడ్ బ్రేవరీస్ (యూబీఎల్), యునైటెడ్ స్పిరిట్స్ (యూఎస్‌ఎల్), మంగుళూర్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ (ఎంసీఎఫ్‌ఎల్), యూబీ ఇంజనీరింగ్ (యూబీఈఎల్)ల మార్కెట్ విలువ గతేడాది రూ.44,650 కోట్లుగా ఉంది.
ప్రస్తుతం అది రూ.22,850 కోట్లకు పడిపోయిందని మార్కెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రూప్ మొత్తం నష్టపోయిన రూ.21,800 కోట్లలో ప్రమోటర్ ఆస్తులు సుమారు రూ.11,500 కోట్లు ఉండటం గమనార్హం. మొత్తం మీద కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నష్టాలు విజయ్ మాల్యా సొంత ఆస్తులు కరిగిపోయేందుకు దారి తీస్తోంది.

కలియుగ వైకుంఠధామం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణమయ పథకానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా భారీ విరాళాన్ని ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు ఆరు కోట్ల రూపాయలను విరాళం అందజేయనున్నట్లు విజయ్ మాల్యా ప్రకటించారు.
గురువారం తిరమల శ్రీ వెంకటేశ్వర స్వామిని విజయ్ మాల్యా గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాల్యా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా.. విజయ్ మాల్యా మాట్లాడుతూ.. వెంకన్న ఆశీస్సులతో ఐపీఎల్‌లో తమ జట్టైన రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు ఆరు కోట్ల రూపాయల విరాళం ప్రకటిస్తూ.. 18 తలుపులకు బంగారు తాపడం చేయించేందుకు మాల్యా అంగీకరించారు.

బాలీవుడ్ పొడవు కాళ్ల సుందరి దీపికా పదుకునే సిద్ధార్థ్ మాల్యాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా తనయుడైన సిద్ధార్థ్ మాల్యాతో దీపికా పదుకునే డేటింగ్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్. దీన్ని రుజువు చేసేలా ఈ జంట ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లోనూ కనువిందు చేసింది.
విజయ్ మాల్యా జట్టైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మట్టికరిపించిన సందర్భంగా దీపికా పదుకునే-సిద్ధార్థ్ మాల్యా జంట సంతోషానికి ఎల్లలు లేకుండా పోయింది. స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించిన ఈ జంట బెంగళూరు గెలవగా ఒకరికొరు కౌగలించుకుని ముద్దు పెట్టుకుని లక్షలాది మంది క్రికెట్ అభిమానులను సంతోషపెట్టారు.
అంతేకాదు సిద్ధార్థ్ మాల్యా ఏకంగా ఆమెను హగ్ చేసుకుని తన జట్టు విజయానికి గెంతులేశాడు. వీరిద్దరి రొమాన్స్ చూస్తూ అక్కడనున్న అభిమానులంతా చూడచక్కని జంట అని మాట్లాడుకున్నారట. మరి కొందరైతే వీరిద్దరి రొమాన్స్ చూడలేక వామ్మో అనుకున్నారట. మరి దీపికా-సిద్ధార్థ్ మాల్యాలు మాత్రం ఎవరినీ లెక్కచేయకుండా తమ పనేదో తాము చూసుకుంటూ ఉండిపోయారట.

రాజ్యసభ కోటీశ్వరుల జాబితాలో లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వైఎస్.చౌదరి రెండో స్థానంలో ఉండగా, జార్ఖండ్ ముక్తిమోర్ఛాకు చెందిన కన్వర్ దీప్ సింగ్ మూడో స్థానంలో ఉన్నారు.
615 కోట్ల రూపాయలకు అధిపతి అయిన విజయ్ మాల్యాకు దేశంలో ఎక్కడా కూడా సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా, ఆయన వద్ద 1989 నాటి మోడల్‌నే ఇప్పటికీ కలిగివున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఎన్నికల సమయంలో రాజ్యసభ ఎన్నికల అధికారికి దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఉద్యోగుల కడుపు కాల్చి టాప్ బాస్‌లకు నైవేద్యం
న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : కింగ్‌ఫిషర్ సంక్షోభం వెనుక అసలు కారణాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. కేవలం పరిశ్రమ ప్రతికూలతలతోనే ఈ సంస్థ కూలిపోలేదు. విచ్చలవిడి ఖర్చులు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కనీవినీ ఎరుగని జీతాలే కింగ్‌ఫిషర్ పుట్టి ముంచాయి. రెండు, మూడేళ్లుగా కింగ్‌ఫిషర్ నష్టాల్లో నడుస్తోంది. అయినా.. కంపెనీ సిఇఒ సంజయ్ అగర్వాల్ జీతం మాత్రం ఆకాశంలోనే ఉంది.
స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయిన మూడు దేశీ విమానయాన సంస్థల్లో అత్యధిక వేతనం అందుకుంటున్న సిఇఒల్లో అగర్వాల్‌ది రెండోస్థానం. మరోవైపు ఉద్యోగులకు జీతాలే చెల్లించలేని దుస్థితి కింగ్‌ఫిషర్‌ది. ఈ కారణంతోనే కింగ్‌ఫిషర్‌ను తాత్కాలికంగా లాకౌట్ చేశారు. కింగ్‌ఫిషర్ సారథిగా అగర్వాల్ 2010-11లో 2.12 కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటే కేవలం ఏడాది కాలంలోనే ఇంతకు రెట్టింపు జీతాన్ని అందుకున్నారు. 2011-12 సంవత్సరంలో 4.01 కోట్ల రూపాయల వేతన ప్యాకేజీని అగర్వాల్ స్వీకరించినట్లు స్టాక్‌మార్కెట్లకు కంపెనీ సమర్పించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయి తే.. ఏప్రిల్ నెల నుంచి తాను కూడా జీతాన్ని అందుకోలేదని అగర్వాల్ అంటున్నారు.
అదేబాటలో మాల్యా..
కింగ్‌ఫిషర్ చైర్మన్, ప్రధాన ప్రమోటర్ విజయ్ మాల్యా సైతం యుబి గ్రూప్‌కు చెందిన పలు కంపెనీల నుంచి ఏటా 1.43 కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు. అయితే.. ఇందులో కింగ్‌ఫిషర్ లేకపోవడం గమనార్హం. గ్రూప్ కంపెనీల నుంచి సిట్టింగ్ ఫీజుల రూపంలో ఈ మొత్తం మాల్యాకు ముడుతోంది. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి మాల్యా ఒక్కో సిట్టింగ్‌కు 1.2 లక్షల ఫీజును వసూలు చేస్తుంటే.. యునైటెడ్ బ్రూవరీస్, మంగళూరు కెమికల్స్ లక్ష రూపాయల చొప్పున చెల్లిస్తున్నాయి. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ ఏకంగా 1.4 లక్షల సిట్టింగ్ ఫీజును ఆఫర్ చేస్తోంది. ఓ రెండు విదేశీ సబ్సిడరీలు సైతం 63 లక్షలు, 76 లక్షల ఫీజును చెల్లిస్తున్నాయి. మొత్తం మీద యుబి గ్రూప్ సారథిగా మాల్యా ఫీజుల రూపంలో కోటిన్నర పైగానే బాదేస్తున్నారు. ఇంతకుముందు ఈ దందా కింగ్‌ఫిషర్‌లోనూ సాగి నా.. సంస్థ నష్టాలను పరిగణనలోకి తీసుకొని మా ల్యా కొద్దిగా కనికరించారు.
కళ్లు చెదిరే ప్యాకేజీలు..
యుబి గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు అందరిలో యునైటెడ్ బ్రూవరీస్ ఎండి కళ్యాణ్ గంగూలీ ఒక్కటే అత్యధికంగా 6.7 కోట్ల రూపాయల జీతాన్ని తీసుకుంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఇది 4.51 కోట్లు పెరిగింది. యునైటెడ్ స్పిరిట్స్ ఎండి అశోక్ కపూర్ 3.5 కోట్లతో ఇరగదీశారు.
మాల్యా అండ్ కో స్టయిల్ ఇలా ఉంటే.. అదే గ్రూప్‌లో మెక్‌డోవెల్ హోల్డింగ్స్ అండ్ యుబి హోల్డింగ్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ భట్, మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఎండి దీపక్ ఆనంద్‌లు నెలకు ఒకే ఒక్క రూపాయి మాత్రమే జీతంగా స్వీకరిస్తుండటం గమనార్హం. వీరిని చూసైనా విజయ్ మాల్యా, అగర్వాల్‌లు జీతాల విషయంలో పట్టువిడుపుగా వ్యవహరించి ఉంటే బాగుండేది. మరో విమానయాన దిగ్గజం స్పైస్‌జెట్ చీఫ్ నీల్ రేమండ్ మిల్స్ వేతనం ఇటీవలే 1.75 కోట్ల రూపాయల నుంచి 4.98 ఓట్లకు పెరిగింది. ఇంతకుముందు అగర్వాల్ స్పైస్‌జెట్ చీఫ్‌గా వ్యవహరించారు. అగర్వాల్, రేమండ్ మిల్స్‌ల తర్వాత జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ సరోజ్ దత్తా 2.11 కోట్ల జీతాన్ని అందుకున్నారు. గత ఏడాదితో పోల్చితే దత్తా జీతం 25 శాతం మాత్రమే పెరిగింది. విమానయాన రంగం నష్టాల్లో పయనిస్తుంటే.. ఈ రంగానికి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు ఈ స్థాయిలో పెరగడం విమర్శలకు దారితీస్తోంది.
అన్నీ పక్కాగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్
కింగ్‌ఫిషర్‌కు డబ్బులు సమకూరినంత మాత్రాన సమస్యలు తొలగిపోవని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ అంటున్నారు. ఇతర విషయాల్లోనూ సంతృప్తి పరిస్తేనే.. కింగ్‌ఫిషర్ విమానాల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విమానాల భద్రత, ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు.. తదితర అంశాలతో సమగ్రమైన ప్రణాళికలను కింగ్‌ఫిషర్ సమర్పించాల్సివుంటుందని, ఆ తర్వాతే విమానయాన రెగ్యులేటర్ డిజిసిఎ స్పందిస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి రెగ్యులేటర్ ఇప్పటికే షోకాజ్ నోటీసును కింగ్‌ఫిషర్‌కు జారీ చేసిందని అన్నారు.
ఈ నెల 5న జారీ అయిన ఈ నోటీసుకు సంస్థ ఇచ్చే జవాబును బట్టే లైసెన్సును రద్దు చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల కింగ్‌ఫిషర్ ఉద్యోగి భార్య ఒకరు ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయంపై మంత్రి స్పందించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా వుండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి నాలుగు నెలల క్రితమే డిజిసిఎ రెగ్యులేటర్ షోకాజ్ నోటీసును కింగ్‌ఫిషర్‌కు జారీ చేశారు. అయితే.. ప్రభుత్వం రెగ్యులేటరీ చీఫ్‌ను పక్కకు తప్పించి కింగ్‌ఫిషర్ లైసెన్సును పునరుద్ధరించింది.

కొత్త సంవత్సరం వస్తుందంటే విజయ్ మాల్యా ప్రపంచంలో అత్యంత హాట్ మోడల్స్‌తో కింగ్ ఫిషర్ క్యాలెండర్ రెడీ చేస్తుంటారు. ఈ క్యాలెండర్‌పై దర్శనమిచ్చే హాట్ భామలతో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ప్రత్యేక గుర్తింపును సాధిస్తుంది.
ఇదే ఆలోచన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు వచ్చిందేమో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ హాటెస్ట్ సెక్సీభామల కలబోతతో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ క్యాలెండర్‌ను రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన హాటెస్ట్ షూటింగ్ ఇటీవలే జరిగింది.
ఈ షూటింగ్ లో కాజల్ అగర్వాల్, శ్రేయ, సోనాక్షి సిన్హా, లక్ష్మీరాయ్, దీక్షాసేథ్, భావన, ఛార్మి, ప్రియమణి, రిచా గంగోపాధ్యాయ వంటి తారలు తమ హాటెస్ట్ అందాలను ఆరబోశారు. ఆ వీడియో మీకోసం.. చూడండి.

బాలీవుడ్ సెక్సీ సుందరి దీపికా పదుకునేను ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వదల్లేకపోతున్నాడు. ఆమె ఎక్కడకు వెళితే అక్కడ తోకెంటే వెళుతున్నాడట. అదేమని ఎవరూ అడిగే సాహసం చేయలేకపోతున్నారు.
అన్నట్లు ఇటీవల 2011 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం మోడళ్ల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దీపికను వెంటబెట్టుకుని వచ్చాడు సిద్ధార్థ్. అంతేకాదు మోడళ్లలో సెక్సీగా ఎవరున్నారో ఎంపిక చేయమంటూ ఆ బాధ్యతను దీపికకు కట్టబెట్టాడు కూడా.
ఎంపికకోసం వచ్చిన మోడళ్లందరికంటే దీపికా పదుకునే అత్యంత సెక్సీగా కనబడుతోందని అక్కడివారంతా అనడంతో సిద్ధార్థ్ తన లోలోపల పొంగి పొర్లిపోతున్న ఉత్సాహానికి కట్టలు వేయలేక... తట్టుకోలేక ఆమెను హత్తుకున్నాడట. వాళ్లిద్దరినీ ఆ స్థితిలో చూసి "ప్రేమంటే ఇదేరా..." అని అక్కడకి వచ్చినవారు ఒకరికొకరు గొణుక్కోవడం కనబడింది.

లిక్కర్ రారాజుకి కష్టాలట! కేంద్రం బెయిలౌట్ ఇచ్చి ఆదుకుంటుందట!!
గత కొన్ని వారాలుగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్ధ వరుసగా తన విమాన సర్వీసులను రద్దు చేసుకుంటోంది. దానివల్ల టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా లెక్క చేయకుండా సర్వీసుల్ని రద్దు చేసుకుంటోంది. దానిక్కారణం ఆ సంస్ధ ఎదుర్కొంటున్న నష్టాలేనట. రన్నింగ్ లో ఉన్న సర్వీసుల్ని రద్దు చేసుకోవడంతో పాటు అసలు మొత్తంగా సర్వీసుల్ని కూడా రద్దు చేసుకుంటోంది. దానితో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్ధకు విమానాల్ని అద్దెకు ఇచ్చిన విమాన కంపెనీలు తమ విమానాల్ని తమకు ఇచ్చేయ్యమని అడుగుతున్నాయట. పైలట్లు, ఇతర ఉద్యోగులు కింగ్ ఫిషర్ మునిగి పోతున్న పడవ అని భావించి సంస్ధను వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారట. అలా వెళ్ళిపోవడం మామూలేనని విజయ్ మాల్యా నచ్చజెపుతున్నా పరిస్ధితి ఘోరంగా ఉందని రాయిటర్స్ లాంటి కంపెనీల ఫ్రెండ్లీ వార్తా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి.
కింగ్ ఫిషర్ కంపెనీ నష్టాల్లోనుండి బైటికి రావాలంటే దానికి మరింత సొమ్ము కావాలని గతంలోనే ఆడిటర్లు హెచ్చరించారని రాయిటర్స్ తెలిపింది. విమాన సర్వీసుల్ని అదేపనిగా రద్దు చేస్తుండడంతో కంపెనీ షేర్లు ఈ సంవత్సరం ఇప్పటికే 67 శాతం పడిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. కంపెనీ ఇప్పటికె విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందనీ, ఆ అప్పును రీ షెడ్యూల్ లాంటిదేదో చెయ్యాలని కంపెనీల మిత్రులు, స్వేచ్ఛా మార్కెట్ పండితులు పరోక్షంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. త్వరగా ఆదుకోకపోతే కంపెనీ కోలుకోవడం కష్టమని కూడా వీళ్ళు తొందరపెడుతున్నారు.
కోటీశ్వరుడు విజయ్ మాల్యాకు ఇన్ని కష్టాలా అని కేంద్ర మంత్రులు ఇప్పటికే చలించిపోయారు. సివిల్ ఏవియేషన్ మంత్రి వాయలార్ రవి తాను ఆర్ధిక మంత్రితో మాట్లాడి ఏదో ఒకటి మేలు చేసి పెడతానని వాగ్దానం చేశాడు. బ్యాంకుల ద్వారా కింగ్ ఫిషర్ కంపెనీకి సహాయం అందజేయడానికి ఆర్ధిక మంత్రిని ఒప్పించే బాధ్యతను ఆయన నెత్తిన వేసుకున్నాడు. కంపెనీ అప్పు ని పునర్మూల్యాంకనం చెయ్యడంలో ఆటంకాలు ఎదురవుతుండడం వలన ఆర్ధిక మంత్రితో మాట్లాడమని తాను ఇప్పటికే విజయ్ మాల్యాకు చెప్పానని కూడా ఆయన చెబుతున్నాడు.
కింగ్ ఫిషర్ సంస్ధకు 60 బిలియన్ రూపాయలు (రు.6000 కోట్లు) అప్పు ఉందని తెలుస్తోంది. ఈ అప్పులో పెద్ద మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులే ఇచ్చాయని తెలుస్తోంది. గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వ, ప్రవేటు బ్యాంకులు రెండూ ఒక విడత కింగ్‌ఫిషర్ కి అప్పుల విషయంలో సహాయం చేశాయి. 12 బిలియన్ రూపాయలు లేదా రు.1200 కోట్ల రూపాయల అప్పుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు రెండూ అప్పుగా రద్దు చేసుకుని ఈక్విటీ షేర్లు కింద మార్చుకున్నాయట.అంటే బ్యాంకులకు అప్పు ఉన్నంతమేరకు కింగ్ ఫిషర్ షేర్లను బ్యాంకుల ఖాతాకు కంపెనీ మార్చిందన్నమాట. ఇప్పుడిక వడ్డీ చెల్లింపుల బదులు షేర్లపైన లాభాలని వడ్డీ చెల్లింపులుగా బ్యాంకులు భావించాలన్నమాట.
ఇది బ్యాంకులకి నిజానికి నష్టం తెచ్చే చర్య. ఎందుకంటే అప్పు పైన వడ్డీ అనేది ఖచ్చితంగా వసూలవుతుంది. కాని అదే సొమ్ముని కింగ్ ఫిషర్ కంపెనీలో ఈక్విటీల కిందికి మార్చినపుడు ఆ ఈక్విటీలపైన లాభాలు వస్తేనే బ్యాంకులకు ఉపయోగం. ఈక్విటీలపైన లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువే. కింగ్ ఫిషర్ షేర్ ధర ఈ సంవత్సరం 67 శాతం పడిపోయింది. కనుక బ్యాంకుల అప్పులు షేర్ల కిందికి మార్చినందుకు గాను వాటికి వడ్డీ దక్కకపోగా, అసలు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఒకవేళ లాభాలు వచ్చినా అవి వడ్డీ రేటుకి సరిపోయినంత లేకపోవచ్చు. 2005 సం. నుండి నష్టాలు తప్ప కింగ్‌ఫిషర్ కి లాభాలే లేవని రాయిటర్స్ సంస్ద చెప్పుకొచ్చింది. అటువంటి కంపెనీ షేర్లు బ్యాంకులు అప్పుల స్ధానంలో కొనుగోలు చేయడం వలన లాభపడింది విజయ్ మాల్యా యే కాని బ్యాంకులు కాదు.
ప్రభుత్వరంగ బ్యాంకులంటే కేంద్ర మంత్రులకు వారి జేబు సంస్ధలే. ప్రజలనుండి డిపాజిట్లు సేకరించి ఆ సొమ్ముని విజయ్ మాల్యాలాంటి బిలియనీర్లకి అప్పులుగా ఇప్పించడానికి మంత్రులు, ప్రభుత్వాలు ఇష్టపడతాయి కాని సామాన్య జనానికి అప్పులిచ్చి ఆదుకోవడానికి సుతరామూ ఇష్టపడవు. కంపెనీలపైనా, వాటి యజమానులైన మిలియనీర్లు, బిలియనీర్లపైనా ఉన్నంత ప్రేమ భారత పాలకులకు భారత ప్రజలపైన లేదని వారి అరవై ఏళ్ల పాలన చెబుతోంది. దానికి ఈ విజయ్ మాల్యా వ్యవహారం తాజా తార్కాణం.
దేశానికి అన్నం పెట్టే రైతు ప్రకృతి వైపరీత్యాల వల్లనో, తెగుళ్ళు సోకడం వల్లనో, గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వల్లనో ఆదాయం లేక అప్పు చెల్లించలేకపోతే, అది మాఫీ చేయడానికి సవా లక్ష కారణాలు రంగం మీదికి వస్తాయి. అయ్యో బడ్జేట్ లోటు పెరిగిపోతుంది అని అహ్లూవాలియా పరుగెత్తుకొస్తాడు. ‘ఎగుమతిదారులకి, దిగుమతిదారులకి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది, రైతులకిస్తే మరి వారికో’ అంటూ వాణిజ్యమంత్రి ఆనంద్ శర్మ ‘అబ్జెక్షన్’ అని అరుస్తాడు. రైతుల రుణాలు మాఫీ చెస్తే బ్యాంకుల లిక్విడిటీ దెబ్బతింటుందనీ, బ్యాంకుల్లో పెట్టుబడులు తగ్గిపోతాయనీ ఆర్.బి.ఐ గవర్నర్ చెవి మెలి పెట్టవచ్చు. ఇక ప్రధాని మన్మోహన్ అయితే “ఇక్కడేమన్నా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా?” అని బ్రహ్మాస్త్రం లెవెల్లో ప్రశ్నల బాణాలు సంధిస్తాడు.
వీళ్లంతా ఇప్పుడు విజయ్ మాల్యాకి అప్పుల భారం దిగిపోయేలా బెయిలౌట్ మంజూరు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ధనికులకు, కంపెనీలకి బెయిలౌట్లు ఇవ్వడం భారత ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కాకపోతే అలా బెయిలౌట్ ఇచ్చాక అందులో కమిషన్ దగ్గరే ఏమన్నా ఉంటే పేచి వస్తుంది. వాయిలార్ రవి కింగ్ ఫిషర్ కి సహాయం చెయ్యమని ఆర్ధిక మంత్రికి సిఫారసు చేస్తానని చెప్పిన తర్వాత బి.జె.పి అగ్ర నాయకుడు అలా ఇవ్వడం నాకు ఇష్టం లేదని ప్రకటన ఇచ్చాడు. నిజానికాయన రధ యాత్రలో ఉన్నాడు. అది కూడా అవినీతికి వ్యతిరేకంగా రధ యాత్ర్ర చేస్తున్నాడు. అటువంటి పెద్దాయన తన పని మర్చిపోయి ఆఫ్ట్రాల్ ఓ ప్రవేటు కంపెనీ వ్యవహారంపైన అర్జెంటుగా ప్రకటన ఎందుకు ఇవ్వవలసి వచ్చింది. ఎందుకంటే ఆద్వాని ప్రకటన చదివి విజయ్ మాల్యా పరిగెత్తుకుని బి.జె.పివారిని కలవాలి. కలిసి తన కష్టాలను చెప్పుకుని “తగిన రీతిలో” వారిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడిక అద్వానీకి కింగ్ ఫిషర్ బెయిలౌట్ విషయంలో అభ్యంతరం ఉండకపోవచ్చు. కావలిస్తే ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద మాట సాయం చేసిన చెయ్యవచ్చు.
కింగ్‌ఫిషర్‌పై బ్యాంకుల దయ
ముంబై, అక్టోబర్ 5 : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌పై బ్యాంకులు దయతలిచాయి. ఉద్యోగుల కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో కొంత మొత్తాన్ని విడుదల చేయాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించుకుంది. గత ఏడు నెలలుగా వేతనాలు లేక కింగ్‌ఫిషర్ సిబ్బంది ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితిని మానవీయకోణంలో చూసిన బ్యాంకులు వారికి జీతాలు అందేలా చూడాలనుకుంటున్నాయి. ఈ మేరకు పన్ను అధికారులు విడుదల చేసిన మొత్తంలో 80 శాతం కంపెనీకి అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ ప్రతీప్ చౌధురి తెలిపారు. గురువారంనాడు అత్యవసరంగా సమావేశమైన బ్యాంకర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బ్యాంకు ఎస్క్రో ఖాతాలనుంచి నిధులను విడుదల చేస్తే కింగ్‌ఫిషర్‌కు 60 కోట్ల రూపాయల వరకు అందే అవకాశం ఉంది.
ఎస్‌బిఐ సారధ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం కింగ్‌ఫిషర్‌కు భారీ మొత్తంలో అప్పులిచ్చాయి. లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఈ బ్యాంకులకు 7,000 కోట్ల రూపాయలు బకాయిపడి ఉంది. ఇప్పుడు కింగ్‌ఫిషర్ సిబ్బందికి జీతాలు చెల్లించ లేని పరిస్థితిలో ఉంది. దీంతో కొంత మంది ఇంజనీర్లు, పైలెట్లు ఏడు రోజులుగా సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల తాళలేక ఓ టెక్నీషియన్ ఇళ్లాలు గురువారంనాడు ఆత్మహత్య చేసుకుంది. కింగ్‌ఫిషర్ నిర్లక్ష్యం వల్లనే ఈమె ఆత్మహత్య చేసుకున్నట్టు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
కింగ్‌ఫిషర్‌కు డిజిసిఎ షోకాజ్ నోటీసు
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మరో గండం ఎదురైంది. ఈ సంస్థ సర్వీసులు దారుణంగా ఉండటంతో ఏవియేషన్ నియంత్రణ సంస్థ డిజిసిఎ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. సర్వీసులు సక్రమంగా లేని కారణంగా ఎందుకు ఫ్లయింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కింగ్‌ఫిషర్‌ను డిజిసిఎ కోరింది. సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఈనెల 12 వరకు తాత్కాలిక లాకౌట్‌ను కంపెనీ ప్రకటించిన విష యం తెలిసిందే. దీంతో అన్ని విమానాలు నేలకే పరిమితమయ్యాయి.
కింగ్‌ఫిషర్‌కు ఎస్‌బిఐ రుణ వితరణ రూ.1,580 కోట్లు
కింగ్‌ఫిషర్‌కు అధికంగా అప్పులిచ్చిన బ్యాంకుల్లో ఎస్‌బిఐ ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంకు 1,580 కోట్ల రూపాయల రుణాన్ని కింగ్‌ఫిషర్‌కు మంజూరు చేసింది. దీనితోపాటు ఐడిబిఐ బ్యాంకు (రూ.720 కోట్లు), పిఎన్‌బి (రూ.435 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.575 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.530 కోట్లు), సెంట్రల్ బ్యాంకు (420 కోట్లు), యుబిఐ (రూ.350 కోట్లు), కార్పొరేషన్ బ్యాంకు (రూ.150 కోట్లు), ఫెడరల్ బ్యాంకు (రూ. 80 కోట్లు)లు రుణాలిచ్చాయి. బ్రాండ్ కింగ్‌ఫిషర్, ఆస్తులు తనఖాలో ఉన్నాయి.

తనిఖీకి విజయ్ మాల్యా డుమ్మా
న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా భద్రతా నిబంధనలను అతిక్రమించారు. ఆయన తన సొంత హెలికాప్టర్‌లో సరాసరి రన్‌వే వద్ద దిగి, అక్కడే ఉన్న తమ కింగ్ ఫిషర్ జెట్ విమానం ఎక్కి ముంబై వెళ్లిపోయారు.
ఏ తనిఖీలు లేకుండా సరాసరి ఇలా రన్‌వేలో ప్రవేశించడానికి, మరో విమానం ఎక్కి వెళ్లిపోవడానికి ఆయన ఏ అనుమతినీ తీసుకోలేదు. ఇలా సరాసరి ప్రైవేటు హెలికాప్టర్‌లో వచ్చిన వారెంతటి వీఐపీలు అయినా సెక్యూరిటీ తనిఖీలు తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి.
కాగా, మాల్యా.. అధికారుల అనుమతి తీసుకున్నారని కింగ్‌ఫిషర్ సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు. ముంబైలో జరుగుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్ ఐపీఎల్ మ్యాచ్ తిలకించడానికి ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే బహుశా ఆయన ఇలా వెళ్లి ఉంటారని ముక్తాయిస్తున్నారు. విమానాశ్రయ భద్రత పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్.. ఈ అతిక్రమణపై బీసీఏఎస్‌కు ఫిర్యాదు చేసింది.

Vijay Mallya (born on 18 December 1955[1] in Kolkata, India) is an industrialist and a second-time member of India's parliament. He is the chairman of the UB Group – one of India's largest conglomerates,[citation needed] with diverse interests in brewing, distilling, aviation, pharmaceuticals, real estate, engineering, fertilizers, biotechnology and information technology.
He is the son of industrialist Vittal Mallya.[1] He took over as the chairman of the company at the age of 28 after his father's sudden demise in 1983.[3]On October 12, 2012, a non-bailable arrest warrant was issued by the 13th metropolitan sessions court, Hyderabad, against Vijay Mallya, and four other directors of Kingfisher Airlines with charges involving a cheque bouncing, that has to be payed to GMR Group
పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా తయారయిది యునెటైడ్ బివరైజెస్(యూబీ) గ్రూపు చైర్మన్ విజయ్ మాల్యా వ్యవహారం. కోట్లకు పడగెత్తిన మాల్యాకు ప్రస్తుతం చేటు కాలం నడుస్తున్నట్టుగా కనబడుతోంది. లగ్జరీకి నిలువెత్తు నిదర్శనంగా కనపడే ఈ బడా పారిశ్రామికవేత్తకు తలనొప్పులు పెరిగాయి. తాజాగా హైదరాబాద్ కోర్టు ఆయనకు బెయిలు వీలుకాని వారెంట్ జారీ చేసింది. సాటి శ్రీమంతులే అసూయపడేలా జీవితాన్ని ఆనందించడంలో ఆరితేరిన మాల్యా తనకెదురైన సమస్యలను సవాల్‌గా తీసుకోవడం మానేసి చేతులెత్తేశారు. లాభాలొస్తేనే వ్యాపారం లేకుంటే మూసేస్తా తరహాలో ఆయన ముందుకు సాగుతున్నట్టు కనబడుతోంది. దీనికి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎపిసోడ్ ప్రత్యక్ష దాఖలా.
చౌకగా ఆకాశయానం అందుబాటులోకి తేస్తామమంటూ 2003లో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఘనంగా ఆరంభించారు విజయ్ మాల్యా. విమాన సేవలు ప్రారంభించిన రెండేళ్లకే కింగ్‌ఫిషన్ నష్టాల బాట పట్టింది. ఎయిన్ డెక్కన్‌ను కలుపుకుప్పటి నుంచి కింగ్‌ఫిషర్ కోలుకోలేకపోయింది. మూడేళ్లలో వెయ్యి కోట్ల రూపాయల నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఏడాది ఆరంభం నాటికి ఈ నష్టాలు ఏడు వేల కోట్ల రూపాయలకు చేరినట్టు అంచనా. జీతాలు ఇవ్వకపోవడంతో ఫైలట్లు సమ్మెకు దిగారు. రేపు, మాపు అంటూ నెట్టుకొచ్చిన మాల్యా చివరకు కింగ్‌ఫిషర్‌కు తాత్కాలికంగా మూసేశారు. దిగ్గజ వ్యాపారవేత్తకు ఇంతకంటే అమానం ఏం కావాలి. లిక్కర్, రియల్ ఎస్టేట్, ఇంజినీరింగ్, ఫెర్టిలైజర్స్, బయోటెక్నాలజీ, ఐటీ వ్యాపారాలు నడుపుతున్న మాల్యా ‘గగనతల’ విపణిలో విఫలమవడం ఎదురుదెబ్బే.
తండ్రి విటల్ మాల్యా మరణంతో 28 ఏళ్ల ప్రాయంలోనే కుటుంబ వ్యాపార పగ్గాలు చేపట్టిన విజయ్ మాల్యాది విలక్షణ వ్యక్తిత్వం. నిండుకుండలా తొణక్కుండా కనబడే ఆయన జీవితాన్ని విలాసవంతంగా గడపడంలో ఏమాత్రం రాజీపడరు. కింగ్‌ఫిషర్ నష్టాలతో మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా బికినీ భామల ఫోజులతో పతి ఏటారూపొందించే క్యాలెండర్‌ను విరమించుకోకపోవడం ఆయన ప్రవృత్తికి అద్దం పడుతోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా తాననుకున్నది చేయడం ఆయన స్టయిల్. గ్లామర్ తారలతో రాసుకుపూసుకు తిరగడాన్ని ఆక్షేపించినా అస్సలు పట్టించుకోరు. అయితే రోజులెప్పుడూ ఒకతీరుగా ఉండవు. ఓడలు బళ్లవుతాయి.
ఇంతకాలం కింగ్‌ఫిషర్‌ను ఒడ్డున పడేస్తానని బీరాలు పలికిన మాల్యా చివరకు చేతులెత్తేశారు. దీంతో ఆయనగారి లైఫ్ స్టయిల్‌పై సొంత ఉద్యోగులే కారాలు, మిరియాలు నూరుతున్నారు. జీతాలివ్వడం చేతగాదుగానీ, మోడల్స్ ఫోజులతో క్యాలెండర్లు అవసరమా అని ఆక్రోశిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారూ ‘మాల్యా.. ఇదేం పనయ్యా’ అంటూ నిట్టూరుస్తున్నారు. మరోవైపు తమ విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టును వాడుకున్నందుకు జీఎంఆర్ సంస్థకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రెండేళ్లగానూ రూ. 10.5 కోట్లు బకాయి పడింది. దీన్ని చెల్లించడంలో విఫలమయినందుకు మాల్యాకు హైదరాబాద్ కోర్టు వారెంట్ జారీ చేసింది. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న మాల్యా పది కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితికి రావడం ఊహకందని విషయం. ఇది ఏమంత విషయం కాదు. కానీ కింగ్‌ఫిషర్ వ్యవహారమే మాల్యా ప్రతిష్టకు సవాల్ విసురుతోంది. విలాసపురుషుడిగా ముద్రపడినా విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్‌కు తిరిగి ప్రాణప్రతిష్ట చేస్తారా లేదా తానే అప్రదిష్ట పాలవుతారా అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

No comments:
Post a Comment