Thursday, October 11, 2012


ఉత్తర అమెరికన్లను అధిగమించిన ఆసియా సంపన్నులు

apr -   Fri, 21 Sep 2012, IST
ఆసియా సంపద అంతా కేవలం జపాన్‌లోనే 54 శాతం కేంద్రీకృతమై ఉంది. తర్వాతీ స్థానంలో చైనా 17 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో చైనాకంటే ఐదు శాతం ఎక్కువ సంపన్నులున్నారు. 2010తో పోలిస్తే ఆసియా ఖండంలోని సంపన్నుల ఆస్తులు 10.8 ట్రిలియన్ల డాలర్ల నుంచి గత ఏడాది 10.7 ట్రిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఉత్తర అమెరికా సంపన్నుల ఆస్తులు 11.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.
గత ఏడాది ఆసియా దేశాల్లోని సంపన్నులు ఉత్తర అమెరికా వాసులనే అధిగమించారు. ఇలా ఆసియా సంపన్నులు ఇతర రీజియన్లను అధిగమించడం ఇదే ప్రథమం. అయితే ఫసిపిక్‌ రీజియన్‌ పరిధిలోని వారితో పోలిస్తే వారి అదృష్టం ముఖం చాటేస్తోంది. దీనికి యూరో జోన్‌లో నెలకొన్న అనిశ్చితే కారణమని చెప్పవచ్చు. మరోవైపు ఆసియా రీజియన్‌ ఆర్థిక రంగంలో సవాళ్లనెదుర్కొంటోంది. ఆసియా సంపద అంతా కేవలం జపాన్‌లోనే 54 శాతం కేంద్రీకృతమై ఉంది. తర్వాతీ స్థానంలో చైనా 17 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా లో చైనాకంటే ఐదు శాతం ఎక్కువ సంపన్నులు న్నారు. 2010తో పోలిస్తే ఆసియా ఖండంలోని సంపన్నుల ఆస్తులు 10.8 ట్రిలియన్ల డాలర్ల నుంచి గత ఏడాది 10.7 ట్రిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఉత్తర అమెరికా సంపన్నుల ఆస్తులు 11.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఆసియా - ఫసిఫిక్‌ రీజియన్‌లో 10 లక్షల మిలియన్‌ డాలర్ల వ్యక్తిగత ఆస్తులు 33.7 లక్షల డాలర్లకు చేరుకోగా ఉత్తర అమెరికాలో సంపన్నుల ఆస్తులు 33.5 మిలియన్‌ డాలర్ల మేరకు చేరుకోగా, యూరప్‌ దేశాల్లోని సంపన్నుల ఆస్తులు 31.7 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. ఆసియా దేశాల్లోని సంపన్నులు కేవలం కుటుంబ పరంగా చేపట్టిన వాణిజ్యం, కుటుంబ ఆస్తులను పెంపొందించు కోవడం ద్వారానే ఈ స్థాయికి చేరుకున్నారని ఆర్‌బిసి వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ తాజాగా విడుదల చేసిన గణాం కాలు చెబుతున్నాయి. ఆయా సంస్థల మేనేజర్లు, ఏజంట్లు, లగ్జరీ గూడ్స్‌ రిటైలర్లు, తదితర వ్యాపారాల ప్రతినిధులతో నిర్వహించిన అధ్యయనంలో ఆర్‌బీసీ ఈ నిర్ధారణకు వచ్చింది. ఫోర్ట్‌ పోలియో మేనేజ్‌మెం ట్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వలేదని కాప్జీమినీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్లయిర్‌ సౌవానౌద్‌ వ్యాఖ్యానించారు. గత ఏడాదిలో హాంకాంగ్‌ సంపన్నలు ఆస్తులు 20.1 శాతం పతనం కాగా, తర్వాత స్థానంలో ఇండి యా సంపన్నుల ఆస్తులు 18 శాతం పడిపోయా యి. దీనికి భిన్నంగా థాయిలాండ్‌ సంపన్నుల ఆస్తులు 9.3 శాతం, ఇండోనేషియాలో 5.3 శాతం పురోభివృద్ధి సాధించారు. జపాన్‌లో సంపన్నుల ఆస్తులు 2.3 శాతం, చైనాలో 1.8 శాతం మాత్రమే స్వల్పంగా పెరిగాయి. యూరో జోన్‌లోని సభ్య దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఆసియా రీజియన్‌ దేశాల్లోని సంపన్నుల ఆస్తులను ప్రభావితం చేసింది. దీనికి తోడు ఆసియా ఖండ దేశాల్లో నెలకొన్న ద్రవ్యోల్బణం, వృద్ధిరేటులో మందగమనం తదితర అంశాలు కూడా సంప న్నుల ఆస్తుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఒకవైపు యూరో జోన్‌లో అనిశ్చితి, సొంత దేశాల్లో సవాళ్లు ఉన్నప్పటికీ ఆసియా - ఫసిపిక్‌ రీజియన్‌ దేశాలు ప్రపంచంలోని ఇతర రీజియన్ల కంటే బలంగా అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయి. సాధారణంగానే ఆసియా - ఫసిపిక్‌ రీజియన్‌ దేశాల నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు ఇక ముందు కూడా భారీగానే కొనసాగుతున్నాయని ఆర్‌బీసీ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక చెబుతోంది.
నైపుణ్యం- ప్రతిభావంతుల లోటు, తక్కువ లాభా లు, సేవలపై నిబంధనలు, తదితర అంశాలన్నీ విదేశీ వాణిజ్య లావాదేవీలకు సవాళ్లుగా పరిణమించాయి. నిర్దేశిత ఉత్పత్తులకు గల డిమాండ్‌కు అనుగుణంగా సంపన్నుల అంచనాల్లో వైవిధ్యం వారి పోర్ట్‌ ఫోలియో పెట్టుబడుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్‌బీసీ నివేదిక చెబుతోంది. 

అత్యున్నత సంపన్నులు ఈ అన్నదమ్ములు

మన దేశంలోనే అత్యంత శ్రీమంతుడు ముఖేష్‌ అంబానీ. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ తాజా లిస్ట్‌ ప్రకారం ఆయన దేశంలోని ధనవంతులలో మెుదటిస్థానాన్ని ఆక్రమించారు. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అతని ఆస్తుల విలువ 13,860 కోట్ల రూపాయలు తగ్గింది. ఇక ముఖేష్‌ సోదరుడు అనిల్‌ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా దేశంలోని కుబేరులలో టాప్‌ టెన్‌లో ఉండగా ఈ ఏడాది ఆ లిస్ట్‌ నుంచి దిగజారడం గమనార్హం. గత ఏడాది కాలంలో అనిల్‌ అంబాని ఆస్తుల విలువ బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. దీంతో ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ఈ ఏడాది ముఖేష్‌ దేశంలోనే అత్యంత కుబేరుడిగా పేరుతెచ్చుకుంటే అనిల్‌ మాత్రం దేశంలోనే పెద్ద మెుత్తంలో ధనాన్ని పోగొట్టుకున్న ధనవంతుడిగా నిలిచారు. దేశంలోని అత్యంత శ్రీమంతులైన సోదరులుగా వీరిద్దరూ నేడు ప్రపంచంలోనే పేరుతెచ్చుకున్నారు.

ముఖేష్‌ అంబానీ
ప్రపంచంలోనే తొమ్మిదవ శ్రీమంతుడు...
Muk

మన్మోహన్ కన్నా మంత్రులే సంపన్నులు!

  • 10/09/2012
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దాదాపు 10.73 కోట్ల రూపాయల ఆస్తులుంటే ఆయన మంత్రివర్గంలోని చాలా మంది ఆస్తులు ఆయనకన్నా ఎక్కువ ఉండడం గమనార్హం. సంపన్నులైన కేంద్ర మంత్రుల్లో దాదాపు 52 కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో ప్రఫుల్ పటేల్ అగ్రభాగాన ఉండగా, సుమారు 22 కోట్ల రూపాయల ఆస్తులతో శరద్ పవార్ రెండో స్థానంలో ఉన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచిన మంత్రుల తాజా ఆస్తుల వివరాలను బట్టి తెలుస్తోంది. కేవలం 55 లక్షల రూపాయల ఆస్తులతో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఈ జాబితాలో చివర్లో ఉన్నారు. గత ఏడాదికి, ఈ ఏడాదికి ప్రధానమంత్రి ఆస్తులు యథా తథంగా ఉన్నప్పటికీ వాటి విలువ మాత్రం పెరిగిందని పిఎంఓ వర్గాలు చెప్తుండడం గమనార్హం.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్, ఆయన భార్య ప్రోమిలాకు కలిపి మొత్తం 45.33 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇందులో ఆయన భార్య ఆస్తుల విలువ 8.11 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. సిబల్‌కు దాదాపు 29.35 కోట్ల రూపాయల విలువైన 12 ఆస్తులుండగా, బ్యాంకుల్లో నగదు, డిపాజిట్లు, షేర్లు అన్నీ కలిపి 2.82 కోట్ల రూపాయల విలువైనవి ఉన్నాయి. ఇవి కాకుండా 35.33 లక్షల రూపాయల విలువైన 3 కిలోల బంగారు ఆభరణాలుండగా. 4.63 కోట్ల రూపాయల అప్పులు, అడ్వాన్స్‌లు కూడా ఆయనకు ఉన్నాయి. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు 50 లక్షల రూపాయల విలువైన ఒక ఇల్లు, 1.99 కోట్లు, 1.25 కోట్ల రూపాయల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి కాకుండా 19.76 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 8.22 లక్షల విలువైన ఒక ఫామ్‌హౌస్, 1.11 కోట్ల విలువైన భూమి కూడా ఆయనకున్నాయి. ఆయన భార్య పేరిట 2.15 కోట్ల రూపాయల విలువైన ఒక ఫ్లాట్, 15. 38 కోట్లు, 84 లక్షల రూపాయల విలువైన రెండు భూములున్నాయి. ఇక విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ పేరిట 1.89 కోట్ల రూపాయల ఆస్తులుండగా బెంగళూరులోని నివాస గృహం, మండ్య జిల్లాలో, సోమనహళ్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిలో సగభాగం కూడా ఆయనకున్నాయి. ఇవే కాకుండా సోమనహళ్లిలో ఒక ఫామ్ హౌస్, బేగూర్‌లోని విశ్వప్రియ గ్రీనరీస్‌లో ఇంటిస్థలం కూడా ఆయనకున్నాయి. ఆర్థిక మంత్రి పి చిదంబరానికి బ్యాంక్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లతో కలిపి మొత్తం సుమారుగా 11.96 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఆయన భార్య నళినికి 4.82 కోట్ల రూపాయల స్థిరాస్తులతో కలిపి మొత్తం 17.81 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. కాగా, గత ఏడాది సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రకటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ ఈ ఏడాది కేవలం 8.85 కోట్ల రూపాయల ఆస్తులనే ప్రకటించగా, ఆయన భార్య అల్కా నాథ్ పేరిట 4.48 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రకటించారు. గత ఏడాది తన కుమారులు నకుల్ నాథ్, బకుల్ నాథ్, కుమార్తె సిమ్రాన్ కూడా తమతో కలిసే ఉండేవారని, అందువల్ల గత ఏడాది వారి ఆస్తులను కూడా కలిపి ప్రకటించానని, ఇప్పుడు వాళ్లు తమపై ఆధారపడి లేరని, అందువల్ల వారి ఆస్తులను చేర్చలేదని కమల్‌నాథ్ డిక్లరేషన్‌లో పేర్కొనడం గమనార్హం. అలాగే నకుల్‌నాథ్, బకుల్ నాథ్‌ల ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన ప్రైవేట్ ట్రస్ట్ ఆస్తులను కూడా ఈ ఏడాది డిక్లరేషన్‌లో చేర్చలేదని ఆయన వివరించారు. దాదాపుగా కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులు, వారి భార్యల పేరిట ఉన్న ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లోనే ఉండడం గమనార్హం.

ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో అమెరికాకు చెందిన టెలికాం టైకూన్ కార్లోస్ స్లిమ్ మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఆసియా సంపన్నుల్లో మనదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 

ప్రపంచంలో అత్యంత సంపన్నులైన టాప్ - 20 జాబితాను బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తమ బిలియనీర్స్ ఇండెక్స్‌ను తాజాగా ప్రకటించింది. ఈనెల రెండో తేదీ నాటికి 68.5 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో కార్లోస్ స్లిమ్ అగ్రస్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్ రెండో స్థానంలోనూ, ఇన్వెస్ట్‌మెంట్ గురు వారన్ బఫెట్ మూడోస్థానంలో నిలిచారు. 

ఇకపోతే... ఇక 26.8 బిలియన్ డాలర్ల నికర విలువతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలువగా, హాంకాంగ్‌కు చెందిన లీకాషింగ్ 25.8 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియా సంపన్నుల్లో రెండో ర్యాంక్‌లో నిలిచారు. మరో భారతీయుడు, ప్రపంచ అతిపెద్ద స్టీల్ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ అధిపతి లక్ష్మీమిట్టల్ 23.6 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ కలిగి ఆసియాలో మూడో సంపన్న వ్యక్తిగా నిలిచారు.

No comments:

Post a Comment