నేటి పరిస్థితుల్లో నయా ఉదారవాద సంస్కరణలు రెండు రకాల భారత దేశాలను సృష్టిస్తున్నాయి. ఒకదానికొకటి అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ దేశాన్ని దోచుకుతినే మెగా అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ఈ వ్యవస్థపై నిలకడగా పోరాటం చేస్తోంది లెఫ్ట్ ఒక్కటే. ఈ గమ్యం చేరుకోవడంలో లెఫ్ట్ చాలా దూరం ప్రయాణించింది. ఈ పథంలో కొన్ని పొరపాట్లు కూడా చోటుచేసుకున్నాయి. ఈ పొరపాట్లను గుర్తించడం, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం, పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించడం ముఖ్యం. ఇదే వామపక్షాల కర్తవ్యం.
మెరుగైన భారతదేశ నిర్మాణం కోసం దీర్ఘకాల, ప్రయాసతో కూడిన పోరాటం చెయ్యాల్సి ఉంది. నిజమైన ప్రతిభను వెలికితీసి నాగరికతను పెంపొందించి పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దేందుకు దోహదం చెయ్యగల పోరాటం చెయ్యాల్సి ఉంది. వామపక్షాల భాగస్వామ్యం లేకుండా ఈ పోరాటం చెయ్యడం సాధ్యం కాదు.
No comments:
Post a Comment