Friday, September 30, 2011

నేడు భారత దేశంలో రు.25 కోట్ల నికర వార్షికాదాయం కలిగిన వారు 62,000 మంది ఉన్నారని అంచనా. 2015 నాటికి వీరి సంఖ్య 2,19,000కు చేరుతుందని భావిస్తున్నారు. ఇలాంటి వారి వద్ద నేడు రు.45 లక్షల కోట్ల సంపద ఉంటే, అది 2015 నాటికి 235 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇలాంటి ఆదాయం కలిగిన వారే విలాస వస్తువుల మార్కెట్‌కు ప్రధాన లక్ష్యం. ఎటి కీర్నే సిఐఐ సంస్థల అధ్యయనం ప్రకారం 2010లో భారత దేశంలో విలాసవస్తువుల మార్కెట్‌ 1.5 బిలియన్‌ డాలర్లు, రూపాయల్లో సుమారు, 650 కోట్లుపైగానే. కాని ఈ అంచనాను చాల మంది అంగీకరించడం లేదు. భారత దేశం జిడిపిని, అధిక నికరాదాయం కలిగిన వారిని పరిగణనలోకి తీసుకున్నపుడు విలాస మార్కెట్‌ కనీసం 3-3.5 బిలియన్‌ డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత దేశంలో విలాసమార్కెట్‌ ప్రపంచంలో 12వ స్ధానంలో ఉందని, అది రాబోయే రెండేళ్లలో 10వ స్థానానికి చేరుతుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment