Tuesday, October 11, 2011

ఒంగోలు ఫిబ్రవరి 15(కె.ఎన్‌.ఎన్‌ ప్రతినిధి) జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన పరిశ్రమలను నెలకొల్పేందుకు 123 పరిశ్రమలకు పెట్టుబడి రాయితి, విద్యుచ్చేత్తి రాయితి, సెల్‌టాక్స్‌ మినహయింపులు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పరిశ్రమల శాఖ జిల్లా స్ధాయి కమిటి సమావేశంలో ఆయన జిల్లాలో పరిశ్రమల అభివ్రద్దిపై సమీక్షించారు. మంజూరైన పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి రాయితి 5 లక్షల 30వేలు విద్యుచ్ఛత్తి రాయితిగా 16 లక్షల 27వేలు, వాణిజ్య పన్ను మినహయింపుగా లక్ష 12వేలు రాయితి కల్పించబడినట్లు చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పు అవత్సహికుల నుండి వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలని పెండింగ్‌ లేదా తీరస్కరించబడిన వాటిపై ఖచ్చితమైన కారణాలు దరఖాస్తులపై నమోదు చేయాలని కలెక్టరు తెలిపారు. గడువు ముగిసిన దరఖస్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన క్రింద 44 యూనిట్లకు కోటి 23 లక్షల బ్యాంకు రుణాలు మంజూరైనట్లు కలెక్టరు ప్రకటించారు. జిల్లాలో కొత్తగా స్ధాపించబడుతున్న లఘ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల స్ధాపన గురించి ఆయన సమీక్షించారు. ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ కార్యక్రమం క్రింద వివిధ బ్యాంకులు మంజూరు చేసిన ఋణాలు వాటికి మంజూరు చేయవలసిన మార్జిన్‌ మనీపై కలెక్టర్‌ సమీక్ష జరిపారు. వివిధ పరిశ్రమలకు కేటాయించబడి వినియోగించుచున్న ముడి పదార్ధాలు, బోగ్గు తదితరాలపై కలెక్టరు చర్చించారు. 

No comments:

Post a Comment