Saturday, December 31, 2011

వెళ్ళిపో వెళ్ళిపో
త్వరగా వెళ్ళిపో
గడచిన వత్సరమా
ఏమిచ్చావ్ కాలమా

సునామిలు ,యుద్దాలు,
ఆక్రమణలు ,ఆవేదనలు
అవినీతి ,ఆత్మవంచనలు
నేరాలు ,మోసాలు

నీతోనే ఉంచు కో


ఉద్వేగం ,ఉద్యమం
వివేచన,ఆలోచన
మచితనం ,మానవత్వం
మానవజాతి వారసత్వం

నీతో తీసుకోని

రావమ్మ,రావమ్మ
త్వరగా రావమ్మ
వచ్చే వత్సరమా
ఏమితెస్తావు కాలమా 

No comments:

Post a Comment