Monday, September 3, 2012


సామాన్యుల పక్షాన నిలిచేందుకే...

  • 10టీవీపై మీడియా వార్తలకు ఛైర్మన్‌ కె నాగేశ్వర్‌ వివరణ
సామాన్య ప్రజల పక్షాన నిల్వడమే 10టీవీ ఆవిర్భావ ఉద్దేశమని ఆ న్యూస్‌ ఛానల్‌ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌ తెలిపారు. 10టీవీపై మీడియాలో ఇటీవల వచ్చిన వార్తా కథనాలపై వాస్తవాలను ప్రజల ముందుంచదలిచామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'మీడియాలో 10టీవీపై ఇటీవల వచ్చిన వార్తా కథనాలపై వాస్తవాలను ప్రజల ముందుంచదలచుకున్నాం. 10టీవీలో సిపిఎం పార్టీకి సంబంధించిన పెట్టుబడులుగానీ, మరే ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన పెట్టుబడులుగానీ లేవు. ఏ రాజకీయ అభిప్రాయం ఉన్న వారైనా 10టీవీలో షేర్లు పొందవచ్చు. 10టీవీలో ఉద్యోగ అర్హతకు కూడా కేవలం పాత్రికేయ నైపుణ్యం తప్ప మరే ఇతర ప్రాతిపదికలూ లేవు. కొంతమంది అభ్యుదయవాదులు, సామాన్య ప్రజల పట్ల నిబద్ధత ఉన్న వారి చొరవతోనూ, సాధారణ ప్రజల భాగస్వామ్యంతోనూ ఏర్పడుతున్న సృజనాత్మక ప్రయత్నం ఇది. ప్రజల పెట్టుబడులతో నడిచే 10టీవీ నిష్పక్షపాతమైన వార్తలు మాత్రమే ఇస్తుంది. కష్టాల్లో ఉండే ప్రజలకు అండగా నిలుస్తుంది. విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకందిస్తుంది. ప్రజల పక్షాన అధికార వ్యవస్థలపై పోరాడేందుకై 10టీవీ ఛానల్‌ ఆవిర్భవిస్తోంది.' 

No comments:

Post a Comment