Monday, September 3, 2012


మహిళా సాధికారత – కుటుంబహింస

Posted By  on December 3, 2007
పి. అనురాధ
మహిళా సాధికారత అంటే అన్ని రకాలైన హక్కులను పూర్తిగా అనుభవిస్తూ అన్ని రంగాలలో పురోగమించడం.
అంటే స్త్రీలు తమకు నచ్చిన రీతిలో గడుపుత కుటుంబంలో, సమాజంలో ఆర్థికంగా, సాంస్కృతిగా, రాజకీయంగా విద్య, వృత్తి, వైద్యం వంటి అన్ని రంగాలలో సమాన గౌరవమైన హోదాను అనుభవిస్తూ స్వయంసమృద్ధిని సాధించడం.
కుటుంబం అనేది ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి, వ్యక్తులకు ధైర్యాన్నిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలతో వ్యక్తి యొక్క అభివృద్ధికి తోడ్పడే వ్యవస్థ. అలాంటి కుటుంబమే స్త్రీల పట్ల చాలా వివక్షతతో వారిని హింసకు గురిచేస్తుంది. కేవలం స్త్రీ అన్న అంశంతోనే ఆమెకు చెందవలసిన అన్ని హక్కులను ఆమె అనుభవించకుండా అణచివేస్తూ అడుగడుగునా ఆమెను హింసకు గురిచేస్తుంది కుటుంబం. కుటుంబంలో స్త్రీలపై జరిగే హింస ఆమె కడుపులో ఉన్నప్పటినుండి కాటికి పోయేవరకు కొనసాగుతనే ఉంటుంది.
కుటుంబంలో జరిగే హింసను అందునా స్త్రీలపై జరిగే హింసను ఎవరూ గుర్తించడం లేదు. సరికదా సాంప్రదాయం, సంస్కృతి, మతం, సమాజం ఇవన్నీ దాన్ని సమర్ధిస్తున్నాయి. అంతేగాక అది పూర్తిగా వ్యక్తిగతమని ఒక కుటుంబానికి సంబంధించినదే తప్ప సమాజానికి ఎటువంటి సంబంధం లేనిదానిగా వ్యవహరించడం వల్ల స్త్రీలు తమపై జరిగే హింసను బయటికి చెప్పుకునే అవకాశమే వారికి కలగడంలేదు. తమ శరీరానికి, తమ మనసుకి, తమ వ్యక్తిత్వానికి తగిలిన గాయలను, బాధలను అనుభవించలేక, బయటికి చెప్పుకోలేక జనాభాలో సగమైన స్త్రీలు నిరంతరం నలిగిపోతనే ఉన్నారు. తీవ్ర మానసిక వేదనతో, ఆరోగ్య సమస్యలతో, శారీరక ఇబ్బందులతో ఆర్థికంగా పూర్తి పేదరికంతో మగ్గిపోతున్న స్త్రీలు సాధికారత దిశగా ఎలా సాగిపోగలరు?
వ్యక్తులు సాధికారత దిశగా సాగిపోవాలంటే వారు అన్ని విషయాల లోన పూర్తి స్వేచ్ఛను అనుభవించాలి, స్వంతంగా నిర్ణయలు తీసుకోగలగాలి. వాటిని అమలుపరిచే అవకాశం ఉండాలి. కుటుంబంలో నిరంతరం జరిగే హింస ఆడపిల్లలను, స్త్రీలను అన్ని కోణాలనుండి, అన్ని వైపులనుండి పూర్తిగా అణచివేస్తుంది. వారి మానసిక పరిపక్వతను, ఆరోగ్యాన్ని అన్నింటిని పూర్తిగా నాశనం చేస్తుంది. దానివల్ల స్త్రీలు అన్ని రంగాల్లోను వెనుకబడి ఉన్నారు.
కుటుంబం అనేది పూర్తిగా వ్యక్తిగత మని, దాని గురించి మాట్లాడడం, చర్చించ డం అనేది తమను తాము కించపరచు కోవడమే అని స్త్రీలకు వారు పుట్టకముందు నుండే నరిపోయడం వల్ల, ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి తేడాలు లేకుండా అన్ని స్థాయిల, అన్ని వర్గాల స్త్రీలు ఎంత కుమిలిపోతున్నప్పటికి కుటుంబహింస గురించి మాట్లాడాలంటే వారి గొంతులు మూగబోతున్నాయి.
స్త్రీలు సమాజంలో సగభాగమని, ఒక భాగం అభివృద్ధి చెందక వెనుకబడి ఉంటే ఆ సమాజం ఆరోగ్యంగా అభివృద్ధి చెందదని, ఒకవేళ అభివృద్ధి చెందినా అది అసంపూర్ణంగా ఎదిగిన ఫలంతో సమాన మని గుర్తించాలి. స్త్రీలకూ హక్కులున్నాయనీ, వాటిని అనుభవించే అధికారమూ ఉన్నదని అదే సాధికారతకు మార్గమని, ఆ దిశగా పయనించాలంటే కుటుంబంలో స్త్రీలు అన్ని హక్కులు అనుభవించాలి. అందుకు కుటుంబం నుంచీ పనిచేయలి. అలా పనిచేయలంటే, కుటుంబహింసను గురించి మాట్లాడాలి. ఇది ఎవరికీ వ్యక్తిగతం కాదు. సమాజం మొత్తం ఇందులో భాగమని వ్యక్తి అంటే సమాజంలో భాగమని అందుకే కుటుంబంలో వ్యవహారాలన్నీ సమాజానికి సంబంధించినవే అని అర్థం చేసుకోవాలి.
ఈ కుటుంబంలో స్త్రీలపై జరిగే హింస వల్ల స్త్రీలు ఎంత నష్టపోతున్నారో తెలుసు కోవాలి అంటే అసలు కుటుంబహింస ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ కుటుంబ హింస అనేది అనాదికాలంగా ఒక పద్ధతి ప్రకారంగా స్త్రీలను అణచివేసే సాధనంగా ఉపయెగిస్తున్నారు. ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సెన్సస్‌’ వారి జాతీయ ఆరోగ్య సర్వే కింద డిసెంబరు 2001న దేశవ్యాప్తంగా 90,000 మంది స్త్రీలతో నిర్వహించిన బేస్‌లైన్‌ సర్వేలో గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అని భేదం లేకుండా దాదాపు 60 శాతం అన్ని మార్గాలకు చెందిన స్త్రీలు భర్తలు భార్యల్ని కొట్టడం తప్పులేదు అని చెప్పారు. అసలు భర్తలు భార్యల్ని ఎందుకు కొడతారో కారణాలు చూస్తే ముఖ్యంగా భార్య ఇంటిని నిర్లక్ష్యం చేసిందనో, ముందుగా భర్త లేదా ఇంట్లో పెద్దవారి అనుమతి తీసుకోకుండా బయటికి వెళ్లిందనో, అత్తమామలకు మర్యాద ఇవ్వకపోతేనో, నమ్మకంగా లేకపోతేనో, సరిగ్గా వంట చేయకపోతేనో, డబ్బులు మరియు ఇతర వ్యవహారాల గురించి మాట్లాడిందనో, ఆడపిల్లల్ని అయితే మగపిల్లలతో కలిసి ఆడుకుందనో, గట్టిగా పెద్దగా నవ్విందనో, మాట్లాడిందనో కొడుత, తిడుత ఉంటారు. ఇలా చిన్నచిన్న మాటలతో అవమానపరచడం, వ్యక్తిత్వాన్ని చులకన చేయడం, ఆర్థికంగా వారిని నిస్సహాయుల్ని చేయడం, ప్రతీ చిన్న విషయనికి స్త్రీలు, ఆడపిల్లలు ఇంట్లోని మగవారిపై ఆధారపడేలా చేయడం, తారాభాయి షిండే అన్నట్లు ”స్త్రీలు ఇళ్ళు దాటిపోకూడదు, కనీసం వారి ఆలోచనలు అయినా కుటుంబపరిధిని దాటిపోకూడదు. స్త్రీలు, ఆడపిల్లలు అదే నిజమని, తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని, తమ స్థానం ఇదే కాబోలు అని భావించేలా చేయడం” కుటుంబహింస యొక్క ప్రధాన లక్షణం మరియు లక్ష్యం.
ఇలాంటి భావనలతో స్త్రీలు తమను తాము తక్కువ అంచనా వేసుకుని ఆత్మన్యనతా భావంతో, అభద్రతా భావంతో సమాజంలో ముందుకు అడుగువేయలేక వారు నిజంగానే అసమర్ధులమేమో, ఎందుకూ పనికిరాని వారిమేమో అనుకుంట మరింత వెనుక బడి పోతున్నారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నించి ముందడుగు వేస్తే వారి ప్రవర్తన తప్పుడు ప్రవర్తన అని, కుటుంబాన్ని ధిక్కరిస్త కుటుంబం పరువు ధిక్కరిస్తున్నారని ఎన్ని రకాలుగా వారిని అణచివేయలో అన్ని రకాలుగా అణచివేస్తున్నారు. దీనివల్ల స్త్రీలతో పాటు పురుషుల ఎంతో నష్టపోతు న్నారు. ఒక ఇంట్లో స్త్రీ రోగిగా, అజ్ఞానిగా, అసమర్ధురాలిగా ముద్రించబడితే, అలా తయరుచేయబడితే ఆ ప్రభావం ఖచ్చితంగా కుటుంబంపై పడుతుంది. కుటుంబంలో పురుషుల భాగమే కాబట్టి ఈ ప్రభావం స్త్రీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, ఎలాంటి నష్టాల్ని కలిగిస్తుందో పురుషులకీ అంతే నష్టం కలిగిస్తుంది. తద్వారా సమాజం మొత్తం మీద ఈ ప్రభావం నష్టం ఉంటుంది.
ఉపయుక్త గ్రంథాలు
1. ఓల్గా – 2004, ”కుటుంబ వ్యవస్థ, మార్క్సిజం – ఫెమినిజం”, స్వేచ్ఛ ప్రచురణలు, హైదరాబాద్‌.
2. తారాబాయి షిండే – 1882, ”పురుషాహంకారానికి సవాల్‌”, శ్రీ శివాజి ప్రెస్‌, పూణే. అనువాదం సి.ఎల్‌.ఎల్‌. జయప్రద, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.

మహిళా సాధికారత-an article from Dr.KESIRAJU RAMPRASAD

12MAR
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉండి మార్కిటింగ్ యార్డ్ లో మహిళా సాధికారత సభ జరిగింది.
ఈ సభకు వి.వి.శివరామరాజు శాసన సభ్యులు అధ్యక్షత వహించారు.
యత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవోభవ
మహిళాదినోత్సవం ఏర్పడటానికి కారణం
•మార్చి 8 న 1857 లో న్యూయార్క్ నగరంలో బట్టల మిల్లులో పనిచేస్తున్న మహిళలు మొదటసారిగా వారి వేతన సమస్యల ఫై, పని వాతావరణం ఫై ఉద్యమం చేసారు.
•మార్చి 8 న 1908 లో 15000 మంది మహిళలు అమెరికా లోని న్యూయార్క్ నగరం లో వోటు హక్కు గురుంచి, మంచి వేతనాలు గురుంచి, బ్రెడ్ అండ్ రొజెస్ అనే స్లోగన్ తో ఉద్యమం చేసారు. బ్రెడ్ అనే పదం లో ఆకలి, రొజెస్ అనే పదం లో మంచి జీవనవిధానం గురుంచి నినదించారు.
•1910 లో మొదటసారిగా డెన్మార్క్ లోని కోపెన్ హెగాన్ లో క్లార జెట్కిన్ నాయకత్వంలో 100 మంది మహిళలు 17 దేశాల నుంచి హాజరయ్యు,వోటు హక్కు గురుంచి,లింగ వివక్షత ఫై పెద్ద రేలి నిర్వహించారు.
•1913 నుంచి రష్యా లో,1922 నుంచి చైనాలో, 1936 నుంచి స్పెయిన్ లో ప్రారంభం అయ్యి ప్రపంచ దేశాల అన్నిటిలో జరుగుతున్నది.
•ప్రారంభంలో ఈ మహిళా దినాన్ని పిబ్రవరి చివరి ఆదివారం జరుపుకొనేవారు. మరికొన్ని దేశాలలో వివిధ రోజులలో జరుపుకొనేవారు.
•1977 లో U .N .O మార్చి 8 నే ప్రపంచం అంతా ఈ రోజునే ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది.అప్పటినుండి మార్చ్ 8 నే నిర్వహించు కోవడం ఆనవాయితీగా వచ్చింది.
•ఈ 2012 ని మహిళల సాధికారత మరియు వారిని ఆకలి,పేదరికం నుంచి పైకి తీసుకురావాలని పిలుపునిచ్చింది.
•ఈ రోజుని ప్రపంచ వర్కింగ్ వుమెన్ డే పరిగణిస్తారు.
•చాల దేశాలలో ఈ రోజుని వారికీ సెలవు దినంగా పరిగణిస్తారు.
చరిత్ర
ఋగ్వేద కాలంలో మహిళ లకు ప్రముఖ స్తానం ఉంది. మహిళలు బాగా చదువుకొన్నారు. స్వయంవరం ద్వారా తమ భర్తలను ఎన్నుకోనేవారు. మైత్రేయి ,గార్గి లాంటి చదువుకొన్న మహిళలు ఉండే వారు.పతంజలి,కాత్యాయన లాంటి వ్యాకరణకారులు ఆ కాలంలో మహిళలు బాగా చదువు కొన్నారని తెలిపారు. 500 BC వేదిక్ కాలంలో భారతీయ మహిళల కు మగవారితో సమానమైన హక్కులు,సముచిత స్తానం ఉండేది. తరువాత కాలంలో వారి స్తానం తగ్గుతూ వచ్చింది.
మిడివల్ పిరియడ్ లో సతి,బాల్య వివాహాలు,వితంతు వివాహలపై నిషేధం, పరదా పద్దతి, దేవదాసి వ్యవస్థ,
చదువు పై ఆంక్షలు పెరిగాయి.
ఆ కాలంలోనే రజియ సుల్తానా, రాణి దుర్గావతి, చాంద్ బిబి, నూర్జహాన్, జహానార్ మరియు జేబున్నీస లాంటి కవయుత్రులు,జిజియ బాయ్ లాంటి తల్లులు, మీరాబాయి లాంటి భక్తురాలు,అక్క మహాదేవి,రాణి జనాబాయి లాంటి వారు ఉన్నారు.
సిక్కు గురువులు మహిళల కు మగవారితో సమానమైన హక్కులు ఇవ్వాలని చెప్పారు.
బ్రిటిష్ కాలంలో రాజారామమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు పూలే లాంటి సంస్కరణవాదులు మహిళల కోసం ఎన్నో ఉద్యమాలు చేసారు. చరణ్ సర్కార్ 1847 లో కలకత్తా లోని బరసత్ లో బాలికలకు ఉచిత విద్యాలయం ప్రారంబించారు. తరవాత కాలంలో దేని పేరు కాలిక్రిష్ణ గరల్స్ హైస్కూల్ గా మార్చారు. పండిత రమాబాయి మహిళల సమస్యల పై ఉద్యమించారు.
కిట్టురు చెన్నమ్మ, రాణి లక్ష్మిబాయి, బేగం హజరత్ మహల్ లాంటి వారు బ్రిటిష్ వారిపై పోరాడారు.
చంద్రముఖి భాసు, కదంబని గంగూలి, అనంది గోపాల్ జోషి లాంటి వారు ఆ రోజులలోనే డిగ్రీ లు సంపాదించారు.
లేడీ కామా, అనిబెసెంట్,ప్రీతి లతా వాడేదర్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత కౌర్, అరుణ అసఫాలి, సుచేత కృపలానీ, కస్తూరిబా గాంధీ, లక్ష్మిసేహగాల్, సరోజినీ నాయుడు,దుర్గాబాయి దేశ్ ముఖ్ లాంటి ఎందరో వనితలు స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నారు.
స్వాత్రంత్యం తర్వాత మహిళలు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాదించుకొన్నారు.
సవాళ్ళు
•భారతీయ మహిళలు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని విద్య, ఉపాధి రంగాలలో ముందంజలో ఉన్నారు.
•అన్ని రంగాలలో మగవారితో పోటి పడి ముందు వరసలోకి వస్తున్నారు.
• బస్సులు, ఆటోలు, రైయుళ్లు,విమానాలు కూడా నడపగలుగుతున్నారు.
•పాల సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు,పంచాయతీలు, మండలాలు,జిల్లా పరిషద్ ల నిర్వహణలో, పాలనలో ప్రావీణ్యం సంపాదించారు.
•రాష్ట్ర ముఖ్యమంత్రులు గా ప్రతిభ చూపుతున్నారు.
•నలబయ్ శాతం కన్నా ఎక్కవ సీట్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో నెగ్గారు.
•దేశంలో ఇప్పటికి సగం మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం విచారకరం.
•లింగ నిష్పతిలో అసమానతలు కొనసాగుతున్నాయి.ప్రతి 1000 మంది బాలురకు 914 మంది బాలికలే ఉన్నారు.
•దేశంలో సర్వికల్ కాన్సర్ తో భాదపడే వారి సంఖ్య ఎక్కువగావుంది.
•ఎన్నో బ్యాంకులు ,ఇన్సూరెన్స్ కంపెనీల,వ్యాపారం సంస్థల నిర్యహణలో ముందంజలో ఉన్నారు.
•కుటుంబం, ఇంటి భాద్యతలు వాళ్ళ చాల మంది మహిళలు పనిలో మరింత భాద్యతలు నిర్వహించలేకపోతున్నారు.
మహిళలు వ్యాపార రంగం లోకి రాక పోవడానికి కారణాలు
1.వారిమీద వారికీ నమ్మకం లేకపోవడం
2.సాంఘిక మరియు సాంస్కృతిక అవరోథాలు
3.వ్యాపార మరియు మార్కెట్ రంగ రిస్క్ లు తీసుకోవడానికి సిద్దంగా ఉండకపోవడం
4.కంఫర్ట్ జోన్ లోనే వ్యాపారం చేయాలనుకోవడం
5.వ్యాపార ప్రేరణ తక్కువ ఉండటం
6.సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పధం ఉండకపోవటం
7. తల్లితండ్రులు చేసే కుటుంబ వ్యాపారాలు పట్ల అబిలాష చూపకపోవడం.
8.వ్యాపార నిర్వహణ జ్జానాలు, నైపుణ్యాలు సంపాదించుకోకపోవడం
9.పెట్టుబడి సమకూర్చుకోవడం లో నిపుణత లేకపోవడం
10.వ్యాపార నిర్వహణ శిక్షణ శిబిరాలకు వెళ్లకపోవడం
11.నూతన వ్యాపార అవకాశాలను గుర్తించ లేకపోవడం.
12.ఎగుమతుల మరియు దిగుమతుల వ్యాపార అవకాశాలు, టూరిసం రంగం, ప్లాస్టిక్, సోలార్, హెర్బల్ అండ్ హెల్త్ కేర్, ఫుడ్ మరియు కూరగాయలు ప్రోసెస్సింగ్ యూనిట్స్ లాంటి ఇతర రంగాల పై అవగాహనలేకపోవడం
13.డిగ్రీ లేక వృతి శిక్షణ కళాశాలలో సరియిన మార్గదర్సికత్వం అందించే గురువులు లేక మెంటార్సు లేకపోవడం.
14.తల్లితండ్రుల నుంచి సరియిన సహకారం లేకపోవడం
ఫై కారణాలు వల్లే కాకుండా ఇతర కారణాలవల్ల మహిళలు వ్యాపార రంగంలో అనుకున్నవిధంగా అబివృది చెందలేకపోతున్నారు.
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దాడి నేర్పింపగన్

No comments:

Post a Comment