Saturday, January 26, 2013

దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు గ్రెగోరియన్ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
ఇస్లామీయ కేలండర్ లేదా ముస్లిం కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో మరియు ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు మరియు దాదాపు 354 దినాలు గలవు.

హిజ్రీ శకం

"హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు క్రీ.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరం గా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638 లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగినది.
  • గ్రెగోరియన్‌ కాలెండరు : ప్రపంచమంటా ప్రామాణికంగా ఉపయోగించబడుచున్నది.
  • హిందూ కేలండర్ : భారత్ నేపాల్ లలో ఉపయోగించబడుచున్నది.
  • తెలుగు కేలండర్  : ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించబడుచున్నది.
  • ఇస్లామీయ కేలండర్ : ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలలో మరియు ముస్లింలు ఉన్న ఇతర దేశాలలో ఉపయోగించబడుచున్నది.
  • ఇరానియన్ కేలండర్ : ఇరాన్ మరియు ఆప్ఘనిస్తాన్ లలో ఉపయోగించబడుచున్నది.
  • హెబ్ర్యూ కేలండర్ : ప్రపంచంలో వున్న యూదులంతా ఉపయోగిస్తారు.
  • బౌద్ధుల కేలండర్ : బౌద్ధులున్న చోట ఉపయోగిస్తారు.

విషయ సూచిక

  • 1 కేలండర్ విధానము
  • 2 ఇతర కేలండర్లు
  • 3 ఉపయోగాలు
  • 4 సమకాలీన కేలండర్లు
    • 4.1 విత్త కేలండర్
    • 4.2 పాఠశాల కేలండర్ 
    • జాతీయ కేలండర్ శక, శకం మీద ఆధారపడి తయారుచేయబడింది. చైత్రం మొదటి నెలగా, 365 రోజులు ఒక సామాన్య సంవత్సరంగా పరిగణించి 22 మార్చి 1957 లో తయారుచేయబడింది. దీనితో పాటు గ్రిగోరియన్ కేలండర్ కూడ క్రింద పేర్కొనబడిన ప్రభుత్వ అవసరాల కోసం వినియోగిస్తారు.
    • ఇండియా గజిట్ ( భారత ప్రభుత్వ పత్రిక)
    • అఖిల భారత రేడియో ప్రసార కేంద్రాల నుండి వచ్చే వార్తలు
    • భారతదేశ ప్రభుత్వం విడుదల చేసిన కేలండర్లు మరియు
    • ప్రభుత్వం ప్రజలను ద్దేశించి చేసే ప్రసంగాలు
    జాతీయ కేలండర్ లోని తేదీలు, గ్రిగోరియన్ కేలండర్ లోని తారీకులకు శాశ్వశంగా అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు, సాధారణంగా 1 చైత్రం 22 మార్చిన మొదలవడం, లీపు సంవత్సరంలో 21 మార్చిన రావడం.

    క్రీస్తు శకము 58 లో “విక్రమార్క శకము” ప్రారంభమైనది.
    విక్రమాదిత్యుడు ఈ “”విక్రమ శకము”నకు అంకురార్పణ చేసాడు.
    “విక్రమార్కశకము”ను సంవత్ శకము” అని కూడా అంటారు.
    వైశాఖమాసము మొదటి నెల, ఫాల్గుణ, చైత్ర మాసములతో  సంవత్సర చక్రము పూర్తి ఔతున్నది.
    మనము ఇప్పుడు రోజూ చూస్తున్న కేలండర్ క్రీస్తు శకము 2011-2012 (2011 CE) ,
    విక్రమార్క సంవత్సరమును BS/ VS- అని సూచిస్తున్నారు.
    నేడు 2011 సంవత్సరము అనగా
    Nepali calendar-2068 BS అని అర్ధము అన్న మాట.
     
    చాంద్రమాన కేలండర్ (ఆంగ్లం : Lunar calendar) ఒక కేలండర్, చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసినది. ఈ కేలండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండర్ లేదా హిజ్రా కేలండర్ లకు మూలం. ఈ కేలండర్ లోనూ 12 మాసాలున్నాయి. ఋతుకాలచక్రాల ఆధారంగా కాకుండా, పరిపూర్ణంగా చంద్రగమనాలపై ఆధారపడియున్నది. సూర్యమాన కేలండర్ కంటే ఈ కేలండర్ లో 11 రోజులు (లీపు సంవత్సరం లో 12 రోజులు) తక్కువ. సూర్యమాన మరియు చాంద్రమాన కేలండర్లు ఒకే స్థితికి ప్రతి 33 సంవత్సరాలకొకసారి వస్తాయి. ఈ కేలండర్ ప్రత్యేకంగా ధార్మిక అవసరాలకు ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో వాణిజ్యావసరాలకునూ ఈ కేలండర్ ను ఉపయోగిస్తున్నారు.
    హిజ్రీ కేలండర్‌ను తప్పించి మిగతావి చాంద్ర-సూర్యమాన కేలండర్ లే. అనగా నెలలు చాంద్రమాన విధముగానే వుంచి చంద్రగమన చక్రాలను లెక్కిస్తారు, తరువాత అంతర్-నెలలను కొలిచి, సూర్యమాన సంవత్సరంతో మమేకం చేస్తారు.
    ఎందుకనగా, ఒక సూర్యమాన సంవత్సరంలో 12 చంద్రమాన నెలలు (synodic months) వుంటాయి, దీనినే సాంప్రదాయికంగా చంద్రమాన సంవత్సరం అని అంటారు. దీనిలో 354.37 దినములు వుంటాయి.
     




No comments:

Post a Comment