Sunday, January 19, 2014

అత్యాచార పర్వం


ఢిల్లీ అయితేనేం
గల్లీ అయితేనేం
ఈ దేశం ఆ దేశం
అనే విచక్షణ మేం
కోల్పోయాం
ప్రకృతి వికృతి
బేధాలేవీ లేవు
చిన్నా పెద్దా
తేడాలు మేం
పాటించం
వావివరుసల
ఇరుసు లేవీ
మమ్మల్ని బంధించ లేవు
మానాభిమానాల
ప్రేమాభిమానాలేవీ
మమ్మల్ని కదిలించ లేవు
పాత కొత్త సమాజాల
వికృత రూపానికి
పుట్టిన మేం
మేకతోలు కప్పుకున్న
తోడేళ్ళ గుంపుమాది
మగవాళ్ళనే పేరు మాది.

(ఢిల్లీలో డానిష్‌ మహిళ
గ్యాంగ్‌ రేప్‌కు నిరసన)
- భవిష్య

No comments:

Post a Comment