లక్ష్మీపుత్రులే..శాసనకర్తలు
2009 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా నాలుగు ప్రధాన పార్టీల (కాంగ్రెస్- 261, బీజేపీ- 177, బీఎస్సీ-147, ఎస్పీ- 63)కు చెందిన 1205 మంది కోటీశ్వరులు పోటీ చేశారు. ఇది అంతకు ముందు 2004 ఎన్నికలతో పోలిస్తే 9 శాతం నుంచి 16.3 శాతానికి పెరిగింది. అంటే ఎన్నికల్లో రానురాను కోటీశ్వరుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నదన్న మాట. తాజాగా జరుగుతున్న ఎన్నికలో పోటీ పడే అభ్యర్థుల్లో కోటీశ్వరుల శాతం 30 శాతానికి పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇక గత ఎన్నికల్లో 47pp3 మంది అభ్యర్థులు పాన్‌కార్డు వివరాలు సమర్పించలేదు.
-చట్ట సభల్లో మెజారిటీ సభ్యులు కోటీశ్వరులే
-నానాటికీ పెరుగుతున్న సంపన్న సభ్యులు
-రైతునాయకులు, సామాజిక కార్యకర్తల కనుమరుగు
-పెరుగుతున్న పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య వేత్తలు
-బీ ఫారం దగ్గరే విచక్షణ చూపుతున్న పార్టీలు.. l
-గాంధేయవాదులు విద్యావంతులకు నో టికెట్
-2014 సార్వత్రిక ఎన్నికల్లో పెరుగనున్న అభ్యర్ధుల ఆస్తులు
హైదరాబాద్, (టీ మీడియా):వేల కోట్ల అధిపతులు చట్టసభల్లో ప్రవేశించడం ఏ వర్గాల మేలు కోసమో చెప్పే పనిలేదు గానీ, రానురాను చట్టసభల్లో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగిపోతోందన్న సమాచారం మాత్రం శుభసూచకం కాదు. ముందు ముందు పేదల ఊసెత్తకుండానే చట్టసభల సమావేశాలు సాగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం రాకపోవచ్చు. 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీనే తీసుకుంటే ఎన్నికైన సభ్యుల్లో 55 శాతం మంది కోటీశ్వరులే. అంతకుముందు ఎన్నికతో పోలిస్తే కోటీశ్వరుల శాసనసభా ప్రవేశాల శాతం వేగంగా పెరుగుతున్న వైనం కనిపిస్తుంది. ఇక పార్లమెంటు పరిస్థితి గమనిస్తే 2004లో లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 156 మంది కోటీశ్వరులే. 2009 నాటికి వీరికి సంఖ్య 315కు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆస్తుల విలువ రూ.288.94 కోట్లు. 2004లో ఆయన ఆస్తులు రూ.9.25 కోట్లు మాత్రమే. వాస్తవానికి 1990 వరకూ పార్లమెంటులో న్యాయవాదుల, రైతునాయకులు అధికంగా ఉండేవారు. వారితో పాటు విద్యావంతులు, కళాకారులు, సామాజిక కార్యకర్తల వంటి వారుండేవారు. పారిశ్రామికవేత్తలు చాలా అరుదు. కానీ 2000 తర్వాత పరిస్థితిలో భారీ మార్పులు వచ్చాయి. రైతునాయకులు కనుమరుగు అవుతుంటే పారిశ్రామిక వేత్తలు, బిల్డర్లు, వ్యాపార వాణిజ్య వర్గాల వారు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. సామాజిక కార్యకర్తలు అదశ్యమైపోతుండగా నేరస్తులు రంగప్రవేశం చేస్తున్నారు. ఇవాళ సగటు పార్లమెంటు సభ్యుడి ఆస్తి రూ. 4 కోట్లు !
img src="http://img.namasthetelangaana.com/updates/2014/Aprl/03/bhanu.jpg" alt="bhanu" class="imgRight"/>
ఖరీదైన రాజకీయాలు..
ఇవాళ రాజకీయాలు చాలా ఖరీదైన వ్యాపారంగా మారిపోయాయి. ఎన్నికలు భారీ వ్యయానికి చిరునామాగా మారాయి. రూ.కోట్లు ఖర్చు పెడితే గానీ చట్ట సభల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. సాదాసీదాగా సైకిలెక్కి ప్రచారాలు చేసే రోజులు పోయాయి. నిరాడంబరులు, గాంధేయవాదులు ఎన్నికల్లో కనిపించకుండా పోయారు. వారికి టిక్కెట్లివ్వడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేని పరిస్థితి. వీరికితోడు సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు చట్టసభల ఊసెత్తగలిగే పరిస్థితి లేదు. ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్సులు చూసి పార్టీలు టిక్కెట్టిస్తున్నాయి. పేదలు దేవుడని నినదించినా, ఆమ్‌ఆద్మీ నినాదాలిచ్చినా టిక్కెట్లు మాత్రం కోటీశ్వరులకే దక్కుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వారి జాబితా మరింతగా పెరిగే అవకాశం ఉందని పలువురి అంచనా. ఈ రకంగా భావి భారతాన్ని పాలించేది కోటీశ్వరులేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివిధ రాష్ర్టాల్లో..
వివిధ రాష్టాల పరిస్థితి చూస్తే యూపీ అసెంబ్లీలో 65 శాతం మంది కోటీశ్వరులు. అలాగే మహారాష్ట్రలో 79శాతం, తమిళనాడులో 64, కర్ణాటకలో8, మధ్యప్రదేశ్‌లో 52, రాజస్థాన్‌లో 56, హర్యానాలో 90, ఢిల్లీ, పంజాబ్‌లలో నూటికినూరు శాతం కోటీశ్వరులే.
ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో 294 నియోజకవర్గాల్లో 3126 మంది పోటీ చేశారు. ఇందులో 499 మంది అంటే 16 శాతం మంది కోటీశ్వరులే. వీరిలో 155 మంది విజయం కూడా సాధించారు. అంటే అసెంబ్లీలో 55 శాతం మంది కోటీశ్వరులేనన్న మాట! ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి టీడీపీ అభర్థిగా నిలిచిన జీ దీపక్‌రెడ్డి ఆస్తి రూ.6pp00 కోట్లు. 2009 కడప పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆస్తి కేవలం రూ.72 కోట్లుగా ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత 2011 మేలో జరిగిన ఉప ఎన్నికల నాటికి ఆయన ఆస్తి రూ.445 కోట్లకు చేరింది. ఖమ్మం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వర్‌రావు రూ.173 కోట్లు, నర్సరావుపేట నుంచి పోటీ చేసిన బాలశౌరి వల్లభనేని రూ.121 కోట్లు, పెద్దపల్లి నుంచి పోటీ చేసిన జి.వివేకానంద్ రూ.72 కోట్లు చూపించారు.
రాజకీయ నాయకుల ఆస్తుల విలువ ఎన్నికకు ఎన్నికకూ మధ్య పెరగడానికి మార్కెట్‌లో స్థిర చరాస్తుల విలువలు పెరగడమే కారణంగా చెబుతున్నారు. ఉదాహరణకు భూములనే తీసుకుంటే ఏటేటా వీటి ధరల్లో పెరుగుదల నమోదవుతూనే ఉంటుంది. అలాగే ఇతర అనేక ఆస్తుల విషయంలోనూ జరుగుతుంది. ఇక ఆదాయాల వద్ధి మరో అంశం. సహజంగానే అనేక మార్గాల్లో వచ్చే ఆదాయాల్లో ఏటేటా పెరుగుదలలు ఉంటాయి. షేర్లు తదతరాలకు సంబంధించి హెచ్చుతగ్గులు భారీగానే ఉంటాయి. ఈ లెక్కన చూస్తే 2009 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తి ప్రస్తుతానికి చాలా హెచ్చింపు అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గతంలో కోటీశ్వరుల జాబితాలోకి రాని వర్గాలు కూడా ఈసారి ఈ వర్గంలోకి అడుగుపెట్టే అవకాశమూ ఉంటుంది. ప్రధానంగా భారతీయుల ఆస్తి స్టాక్స్, బంగారం, రియల్ ఎస్టేట్స్, వ్యవసాయ భూములుగా ఉంటుంది. ఇతర మార్గాల్లో ఆస్తులు ఉంచుకునేవారు తక్కువే.
నిఫ్టి ఐదేళ్లల్లో 144 శాతం పెరిగింది. 2009 మార్చి 20 నుంచి 2014 మార్చి 20 నాటికి ఈ పెరుగుదల కనిపిస్తోంది. అంటే అభ్యర్థుల ఆస్తుల విలువ అదే స్థాయిలో పెరిగి ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంకు ఇండియా ప్రకారం 2009 నుంచి 2014 నాటికి బంగారం ధరలో చాలా మార్పు వచ్చింది. ఏకంగా 129 శాతం పెరిగింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ పెరుగుదలే కనిపిస్తోందని నేషనల్ హౌజింగ్ బ్యాంక్ చెబుతోంది. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఎక్కడ రాజధాని ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలతోనే పలు నగరాలు, జిల్లాలు, ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. కొన్ని చోట్ల హైదరాబాద్‌కు తీసిపోని రేట్లు పలుకుతున్నాయి. బడానేతలు అనేకులు ఆ ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. క్యాపిటల్ మైండ్ ఆల్ ఇండియా ఇండెక్స్ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ 63 శాతం పెరిగింది. వ్యవసాయ భూముల ధరలు కూడా బాగా పెరిగాయి. ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం భూ సేకరణ జరుపుతుండడంతో విలువలు పెరిగినట్లు అంచనా. కంపౌండెడ్ యాన్వల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) ప్రకారం వ్యవసాయ భూముల ధరలు 2001 నుంచి 2013 వరకు 9.6 నుంచి 55 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment