దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 1993 నుంచి కేటాయించిన 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన నాలుగు బొగ్గు క్షేత్రాలను మినహాయించింది.218 బొగ్గు క్షేత్రాల భవితవ్యం నేడు తేలిపోనుంది.. రద్దయిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పునరుద్ధరించబడతాయా? లేక కొత్తవారికి కేటాయిస్తారా? పూర్తిగా రద్దు అయితే ఆయా కంపెనీల భవిష్యత్ ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలకు నేడు సుప్రీం కోర్టు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును వెల్లడించనుంది.
ఆగస్ట్ 25న బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం
ఆగస్ట్ 25న బొగ్గు గనుల కేటాయింపులపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో యూపీఏ, ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలపై సీరియస్‌గా స్పందించింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 1993 నుండి జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో పారదర్శకత లేదని సుప్రీం అభిప్రాయపడింది. కేటాయింపులు ఎలా ఉండాలన్న దానిపై సెప్టెంబర్ ఒకటో తేదీన తీర్పు వెల్లడిస్తానని ప్రకటించింది.
స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన కేటాయింపులన్నీ అక్రమమే....
1993 తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన బొగ్గు బ్లాక్స్ కేటాయింపులన్నీ అక్రమమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బొగ్గు గనుల కేటాయింపులు చట్ట విరుద్ధంగా జరిగాయన్న సుప్రీం.. వాటిని రద్దు చేసింది. 1993 నుంచి 2010 వరకు జరిగిన 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ అక్రమమే అని స్పష్టం చేసింది.
లక్షా 83 వేల కోట్ల నష్టం జరిగిందని 2012లో కాగ్ నివేదిక....
2004-11 మధ్య కాలంలో లక్షా ఎనభై మూడు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని 2012లో కాగ్ నివేదిక వెల్లడించడంతో..సుప్రీం కోర్టు పర్యవేక్షణలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై సీబీఐ విచారణ చేపట్టింది. బొగ్గు గనుల కేటాయింపులను బహిరంగ వేలం పాట ద్వారా కాకుండా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు నేరుగా కేటాయించడం వల్ల ఈ నష్టం వాటిల్లినట్లు కాగ్ విమర్శించింది. సెప్టెంబర్ 9న తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం ... నేడు తుది తీర్పును ఇవ్వనుంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందన్నది సర్వాత్రా ఉత్కంఠ రేపుతోంది. కోల్‌గేట్ స్కామ్‌లో కేంద్రం సుప్రీం కోర్టులో సోమవారం మరో పిటీషన్ దాఖలు చేసింది. ఒకవేళ బొగ్గు గనుల కేటాయింపులను న్యాయస్థానం రద్దు చేయాలనుకుంటే 46 బ్లాకులకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తి దారుణంగా ఉందని.. బొగ్గు కూడా అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తప్పవని న్యాయస్థానం ముందు అటార్నీ జనరల్ వాదించారు. బొగ్గు గనుల కేటాయింపులు రద్దు చేస్తే వెంటనే వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అయితే కొన్నింటికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న.. గనులను రద్దు చేస్తే విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని సర్కార్ వాదన.
కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం
1993-2010 మధ్య కేంద్రం 218 బొగ్గు గనులను సొంత అవసరాల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారు. లక్షల కోట్ల అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక బయటపెట్టడం, సిబిఐ దర్యాప్తు వెంటవెంటనే జరిగాయి. దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా మారింది. దీనిపై కోర్టు విచారణ కూడా పూర్తైంది. వాస్తవానికి సోమవారం తుది తీర్పు రావాల్సి ఉంది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని.. వేల కోట్ల ప్రజాధనం అన్యాక్రాంతమైనట్టు గతవారం కోర్టు తేల్చి చెప్పింది. పాలకులు పారాదర్శకంగా వ్యవహరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
సర్కార్ కొత్త మెలిక
ఈ నేపధ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సమయంలో సర్కార్ కొత్త మెలిక పెట్టింది. కరెంట్ కష్టాల పేరుతో కొన్ని బ్లాకుల కేటాయింపులు రద్దు చేయవద్దంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే ఇదంతా పెద్ద కంపెనీల ప్రయోజనాలు కాపాడేందుకేనని విమర్శలున్నాయి. షేర్ మార్కెట్‌లో కంపెనీల షేర్ల ధరలు పెరగడం ఇందుకు నిదర్శనం. కోర్టులో కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి తప్పుడు మార్గాల్లో గనులు కేటాయించారని బిర్లా, అధికారి పారేక్‌లతో సహా 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ తన తుది నివేదికలో మాత్రం అక్రమాలు జరగలేదని పేర్కొంది. దీనిపై కోర్టు వివరణ కోరింది. హిందాల్కోకు గనులు ఎలా కేటాయించారు. ఇందులో అక్రమాలు జరగలేదని ఎలా చెబుతున్నారు. తలబరా బ్లాకులో కేటాయింపులు నిరాకరించిన నెలరోజుల్లోనే అక్రమ పద్దతుల్లో అనుమతులు ఇచ్చారని క్రిమినల్ కేసులు పెట్టారు కదా? నేరం జరగకపోతే కేసులు ఎందుకు నమోదు చేశారన్నదానిపై స్పష్టత ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. దీనిపై వివరణ ఇవ్వడానికి సెప్టంబర్ 12 వరకు గడువు ఇచ్చింది.
అక్రమాలకు సక్రమం చేసేందుకు సర్కార్ యత్నం
మొత్తానికి అన్ని మార్గాల్లో బొగ్గు గనుల అక్రమాలకు సక్రమం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. బొగ్గు గనుల అక్రమాలను ఆస్త్రంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఇప్పుడు అంతా మర్చిపోయింది. అసలు కుంభకోణమే జరగలేదన్న వాదనను కూడా తెరమీదకు తెస్తుందోమో?

No comments:
Post a Comment