దళిత చైతన్య దీప్తి చందలూరు
ప్రజాశక్తి -పంగులూరు
ఆ గ్రామం సామాజి కోద్యమానికి ఊపిరి పోసింది. దళితుల్లో ఆత్మ గౌరవాన్ని నింపే పోరా టాలకు ఆ గ్రామం వేదికైంది. కమ్యూ నిస్టుల అండతో ఆ గ్రామ దళితులు గౌరవ జీవనం సాగించారు. పంగులూరు మండలం చందలూరు గ్రామం కూడా కమ్యూనిస్టు కోటగా భాసిల్లింది. దళితులు కమ్యూని స్టులను తమ వారిగా భావించారు. వారి వెన్నంటే సాగారు. ఫలితంగా ఎర్రజెండా ఆ గ్రామంలో సమున్నతంగా ఎగసింది.
సాంఘిక బహిష్కరణపై పోరు
ఆ గ్రామ దళిత కాలనీకి చెందిన సాంసన్ మాస్టారిపై పెత్తందార్లు దాడి చేశారు. దాన్ని దళితులంతా ఐక్యతతో ఎదుర్కొన్నారు. ఫలితంగా దళితవాడ మొత్తాన్ని సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. అప్పటి వరకూ తమ చెప్పు చేతల్లో, కనుసన్నల్లో పనిచేసిన దళితులు ఒక్కసారిగా ఎదురు తిరగటాన్ని సహించలేక పెత్తందార్లు ఆ పని చేశారు. విషయం తెలుసుకున్న ఆనాటి కమ్యూనిస్టు నాయకులు మాదాల నారాయణస్వామి, తిమ్మరాజు లక్ష్మినారాయణ, కొల్లా వెంకయ్యల ఆ గ్రామాన్ని సందర్శిస్తూ దళితులకు మద్దతుగా నిలిచారు. వారిని చైతన్యపరిచారు.
గోవిందయ్య చూపిన మార్గం....
ఆ కాలంలోనే గుంటూరు జిల్లా నర్సా యపాలేనికి చెందిన మానం గోవిందయ్య అక్కడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ చందలూరుకు మకాం మార్చారు. ఇక్కడ కొంతమంది యువకులకు కమ్యూనిస్టు సిద్ధాంతాల గురించి ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించి బోధించారు. ఆయన ప్రభావంతో గ్రామంలో కొంతమంది కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. గ్రామానికి చెందిన పెంట్యాల వెంకటేశ్వర్లు, పెంట్యాల సుబ్బారావు, ఉపాధ్యాయుడు ఇళ్ల రాఘవులు, పెంట్యాల ఆదిశేషు, చెరకు రామయ్య, వడ్డపల్లి రాఘవులు, నాదెండ్ల కృష్ణమూర్తి, వజ్జా లక్ష్మయ్య, సూర్యనారాయణ వంటి వారంతా సమైక్యంగా కదిలారు. ప్రతిరోజు కలుసుకోవటం, గ్రామంలోనూ, జిల్లా, రాష్ట్రంలోనూ జరిగే పరిణామాలను చర్చంచుకోవటం నిత్యకృత్యమైంది. ఆ పాటికే పార్టీపై ఎలా నిషేధం ఉంది. అయినా నాయకులు దొంగచాటుగా, మారువేషాల్లో వచ్చి వీరిని కలిసేవారు. అదే సమయంలో తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ ఉద్యమ నేతలకు చందలూరు గ్రామస్తులు ఆశ్రయం ఇచ్చారు. కమ్యూనిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో గ్రామానికి చెందిన 10 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అయినా యువకులు కమ్యూనిస్టు పార్టీవైపు నిలబడ్డారు. పార్టీ జిల్లా నాయకుడు కొంగర కోటయ్య 1952లో గ్రామానికి వచ్చి యువకులకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు.
పిచ్చిమానికల వ్యతిరేకోద్యమం!
తొలుత పిచ్చి మానికలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇళ్లలో ఉన్న పిచ్చమానికను తీసుకొచ్చి బ్యారెన్ పొయ్యిలలో వేసి తగలబెట్టారు. పిచ్చమానికలతో ధాన్యం ఇస్తే తీసుకోవద్దని కూలీలకు చెప్పారు. కొందరు రైతుల సహకారం కూడా తోడవడంతో గ్రామంలో ఉద్యమం మంచి ఫలితాలనిచ్చింది. పేదల్లో పార్టీపై విశ్వాసం పెరిగింది. గ్రామ చెరువులో దళితులు నీరు తెచ్చుకోరాదన్న వివక్షను రూపుమాపారు. గ్రామంలోని 200 ఎకరాల బంజరు భూమిని పేదలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పంచారు. గ్రామంలో జరిగే తిరునాళ్ల, అమ్మవారి జాతర్లలో జరిగే జంతుబలినీ ఎదుర్కొన్నారు. నిరంతరం గ్రామంలో ఎదురయ్యే సమస్యలపై పార్టీ పోరాడింది. ఆ తర్వాత కాలంలో పార్టీలో వచ్చిన మార్పుల్లో చందలూరు కమ్యూనిస్టు పార్టీ సభ్యులంతా నక్సలైట్ల వైపు మొగ్గు చూపారు. తర్వాత ఎడాది తిరక్క ముందే ఆ ఉద్యమాన్ని వదిలి తిరిగి సిపిఎం సానూభూతి పరులుగా మారారు.
కమ్యూనిస్టులే సర్పంచులు!
1953లో పెంట్యాల వెంక టేశ్వర్లు, 1965లో మాగులూరి కమల నాథం, 1970లో కర్రి వెంకట సుబ్బారావులు కమ్యూనిస్టు పార్టీ తరపున సర్పంచ్‌లుగా గెలుపొందారు. రాష్ట్ర నాయకులు మాదాల నారాయణ స్వామి, రావినారాయణ రెడ్డి, కొల్లా వెంకటయ్య, లావు బాల గంగాధరరావు వంటి నాయకులు అనేక సార్లు ఆ గ్రామ కార్యకర్తలను ఉత్సాహ పరిచేందుకు వచ్చారు. ఇప్పటికీ ఆ గ్రామంలోని దళితులు, పేదలు ఎర్రజెండా వెంటే సాగుతూ చైతన్యం ప్రదర్శిస్తున్నారు
Posted on: Tue 17 Mar 04:45:58.559366 2015

No comments:
Post a Comment