మారు వేషంతో వెళ్లి స్టింగ్ ఆపరేషన్ నిర్వహిద్దాం అనుకున్నారు రాణా అయూబ్. తెలిసిన ఒక నటి మేకప్‌మెన్ సహాయం తీసుకొని జులపాల జుట్టును కుదురైన జుట్టుగా మలుచుకుంది. కశ్మీరీ చుడీదార్ వేసుకుని మరి కొన్ని చిన్న చిన్న మార్పులతో రాణా కాస్తా మైథిలి త్యాగి అవతారమెత్తింది. అమెరికాలోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థిని అని మోదీ ముఖ్యమంత్రిత్వంలో వెలిగిపోతున్న (వైబ్రంట్ గుజరాత్) గుజరాత్‌పైన డాక్యుమెంటరీ నిర్మించటానికి భారతదేశం వచ్చినట్లు విజిటింగ్ కార్డు, ఫోన్ సిమ్ తదితర సాక్ష్యాలు సంపాదిం చుకుంది. విద్యార్థుల 'ఆదానప్రదాన' కార్యక్రమం కింద భారత్‌కు వచ్చిన మైక్ (పేరుమార్పు) అనే 19 ఏళ్ల ఫ్రెంచి యువకుడ్ని తన అసిస్టెంటుగా నియమించుకుంది. మైక్‌కు మైథిలి ప్రాజెక్టు ఏమిటో తెలీదు. అది 2010-11 మధ్యకాలం. మైథిలి ఆమె అసిస్టెంటు ఇద్దరూ అహ్మదాబాద్ చేరుకున్నారు. నెహ్రూ ఫౌండేషన్‌లో చిన్న గదుల్ని అద్దెకు తీసుకున్నారు. అహ్మదాబాద్ నగరంలో షూటింగ్ నిర్వహిస్తూ క్రమంగా అధికారులు, రాజకీయ నాయకులు తదితరులతో స్నేహం ఏర్పరచుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ అనేసరికి ఈ పని మరింత సులువైంది.
ఆపరేషన్ ప్రారంభం
రహస్య రికార్డింగ్ పరికరాలను కుర్తా, వాచ్, డైరీ, చెప్పుల్లో అమర్చుకున్నారు. అనేక మంది ముఖ్యులతో 'స్నేహపూర్వక సంభాషణలు' జరిపారు. మొత్తం 8 నెలలపాటు ఈ స్టింగ్ ఆపరేషన్ కొనసాగింది, చివర్లో అనుకోకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక అధికారి తీసుకెళ్లారు. మెటల్ డిటెక్టర్ గుండా లోనికి వెళ్తుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుందట. పట్టుబడితే బహుశా ఎన్‌కౌంటర్లో చనిపోయి మృతదేహం కూడా దొరకని కౌసళ్ బీ గతే పట్టే దేమో! 2002 గుజరాత్ నరమేధంలో నరేంద్ర మోదీ, అమిత్ షాల ప్రమేయముందని, గెస్ట్ హౌస్‌లో బంధీలుగా ఉన్న ఇష్రత్ జహాన్ తదితరులను అప్పటి హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ఎన్‌కౌంటర్ చేయించాడని వాటికి సంబంధించిన ముఖ్యమైన సాక్ష్యాల్ని రికార్డు చేశానని చెప్పారు.
తెహల్కా తిరస్కారం
3 నెలలు గడిచాయి. హఠాత్తుగా ఢిల్లీ నుంచి కబురందితే రాణా తెహల్కా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి వరకు రికార్డు చేసిన ఆడియో వీడియోలను రాణా ఎడిటర్‌కు చూపించారు. ''ఇవన్నీ కాఫీటేబుల్ సంభాషణలు లాగున్నాయని పత్రికలో ప్రచురణకు పనికి రావని, ఇప్పటికే తెహల్కాపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని ఇలాగైతే పత్రిక మూతబడ్తుందనీ...'' ఏదేదో చెప్పారు. పరిశోధన ఆపేయమన్నారు. టేపుల్ని ధ్వంసం చేయమని హుకుం జారీచేశారు'' అని వాపోయారు రాణా. ఈ టేపుల్ని పరిశీలించి అర్హత ఉంటేనే ప్రసారం చేయమని, ప్రచురించమని ప్రముఖ ఎడిటర్లను రాణా అడిగారు. అన్ని చోట్లా తిరస్కారమే ఎదురైంది. ఈ మధ్యకాలంలో తెహల్కా ఎడిటర్ రేప్ కేసులో చిక్కుకున్నప్పుడు ఆయన తీరుకు నిరసనగా ఆమె తన సంస్థకు రాజీనామా చేశారు. రాణా నాలుగేళ్లలో ఏడు మీడియా సంస్థల్లో ఉద్యోగాలు మారారు. సంభాషణల్ని పుస్తకంగా ప్రచురిద్దామని ప్రయత్నించారు. అయిదుగురు పబ్లిషర్స్ ప్రచురణకు తిరస్కరించారు. ఈ విధంగా అయిదేళ్ల పాటు మానసిక ఒత్తిడి అనుభవించారు. సైకియాట్రిస్ట్ సహాయంతో ఇప్పుడు కోలుకుంటున్నారు. చివరికి 'గుజరాత్ ఫైల్స్ : అనాటమీ ఆఫ్ ఎ కవర్ - అప్' పేరిట గ్రంథాన్ని తీసుకువచ్చారు.
ఆదుకున్న సోషల్ మీడియా
ఢిల్లీలో జరిగిన గుజరాత్ ఫైల్స్ పుస్తకావిష్కరణ సభకు బర్ఖా దత్, రాజ్‌దీప్ సర్దేశారు వంటి ప్రముఖ సంపాదకులు, అరుంధతీ రారు వంటి మేధావులు, అనేక మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు హాజరయ్యారు. అయితే తెల్లారి ప్రధాన స్రవంతి మీడియాలో వార్తయినా కనిపించలేదు. ఇదే సమయంలో మీడియా మోదీ రెండేళ్ల పాలన విజయాలపై రోజూ అడ్వర్‌టైజ్‌మెంట్లు ప్రసారంచేస్తూ 'పండుగ' చేసుకుంటున్నది! సోషల్‌మీడియా కారణంగా ఈ పుస్తకానికి మంచి ప్రచారం లభించింది. రెండు వారాల్లో దాదాపు 20 వేల కాపీలు అమ్ముడయ్యాయి. దేశంలో ప్రస్తుతం ఇది నెంబర్‌వన్ బెస్ట్ సెల్లర్ అయ్యింది.
'గుజరాత్ ఫైల్స్' పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రధాన స్రవంతి మీడియా పోకడలు, రాజకీయ నాయకులు, వ్యవస్థల తీరుతెన్నులపై ఎంతో ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ''జర్నలిజంలో డిగ్రీ చదివేటప్పుడు మాకు నైతిక విలువలు పాటించాలని, సత్యనిష్ట ఉండాలని, సామాజిక న్యాయానికి కట్టుబడాలని నేర్పారు. ఇప్పుడు నా పరిశోధనను ఎందుకు ప్రచురించటం లేదు? పాత్రికేయులు గిన్నిపిగ్స్ అనుకొంటున్నారా'' అంటూ పెట్టుబడిదారీ మీడియా యాజమాన్యాల్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. అధికార కేంద్రాలను ప్రశ్నించే పరిశోధనాత్మక కథనాలను చంపేస్తారా అని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవస్థ లోపాలను ఎత్తిచూపడానికి, పాత్రికేయ విలువలు కాపాడటానికి యుద్ధం చేయాల్సిందేనని'' ప్రసంగించారు.మీడియాలోనే రెబెల్ రాణాకు జేజేలు.. మన దేశానికి ఇలాంటి నిబద్ధత కలిగిన వేలాదిమంది పాత్రికేయులు, మేధావుల అవసరం ఎంతయినా ఉంది.
- బి. భాస్కర్
9989692001

No comments:
Post a Comment