ప్రపంచ విజేతలు-వ్యక్తిత్వ నిర్మాణం-2
ముద్రణ: లోకాయిత ప్రచురణలు-పొన్నూరు
వెల-రూ: 200/-
పేజీలు-266
ప్రతుల కొరకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్‌లు
సమాజ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న కొత్త యువతరానికి కత్తి పద్మారావు ఇస్తున్న కానుక ఈ పుస్తకం. 'కెరీర్ గైడెన్స్ అనేది నేడొక పాపులర్ సబ్జెక్ట్. దూసుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, తోసుకొస్తున్న మార్పులు, కొత్త తరానికి ఒక సవాలు విసురుతున్నాయి. ఈ సవాలును ఎదుర్కోవడం కోసం యువత తడబాటుకు గురవుతున్నది. ఉపాధి, పెళ్లి, కుటుంబ జీవనం, సామాజిక సమస్యలలో తమ పాత్ర ఏమిటనేది నిర్ణయించుకోవాల్సిన సంధి కాలం ప్రతి ఒక్కరికీ వస్తుంది. సరైన మార్గదర్శకత్వం ఉంటే కొత్త తరం సమాజాన్ని ముందుకు నడుపుతుంది, వ్యక్తి స్వార్థం-సామాజిక ప్రయోజనాలకు మధ్యనున్న వైరుధ్యాన్ని సరైన రూపంలో విశ్లేషణ చేయగలిగితే మంచి మార్గం దొరుకుతుంది.

'నీ కోసమే నీవు జీవించు', 'ముందు నీ సామర్థ్యాన్ని పెంచుకో', 'విజయానికి ఆరు మెట్లు' ఇలా రకరకాల పేర్లతో వ్యక్తిత్వ వికాస సాహిత్యం, 'కెరీర్ గైడెన్స్' సంస్థలు చూపే మార్గం నుంచి కొత్త దారి తాకి, వ్యక్తి వికాసానికి కొత్త భాష్యం చెప్పారు కత్తి పద్మారావు. తను ఎదుగుతూ సమాజాన్ని ఎలా ముందుకు నడపాలనే విషయాన్ని ముగ్గురు సామాజికవేత్తల జీవితాల నుండి వ్యక్తిత్వ వికాస సూత్రాలను వెలికి తీసి నవతరాన్ని నూతన మార్గానికి నడిపించే ప్రయత్నం చేశారు. వ్యక్తిత్వ నిర్మాణంలో ఉండాల్సిన తత్వాన్ని పట్టి చూపించారు. 'ఇతరులను నిందిస్తూ ఆధిపత్య ధోరణుల్లో బతుకుతూ ఇతరులపై పెత్తనం చేయాలి అనుకుంటూ వ్యక్తిత్వాలను దిగజార్చుకుంటున్న మార్గం నుండి, 'నెగటివ్' ధోరణి నుండి స్వీయ నియంత్రణ ద్వారా అధ్యయనం, సామాజికాంశాల పరిశీలన ద్వారా కొత్త తరాన్ని ఎలా తీర్చిదిద్దాలో.... కొత్త ప్రతిపాదన చేశారు.
డా.బి.ఆర్.అంబేద్కర్, బెర్ట్రాండ్ రస్సెల్, విలియం వార్డ్స్‌వర్త్ ముగ్గురు ప్రముఖుల జీవన వికాస కృషి ఈ రచయితనూ ప్రభావితం చేసింది. వారి నుండి భావి తరాలు నేర్చుకోదగ్గ విషయాలను, వదిలేయాల్సిన చర్యలను రచయిత విశ్లేషించారు. జ్ఞాన సంపాదన, స్థిర చిత్తం, శీలవంతులై ఉండటం, ధైర్య -సాహసం, కుటుంబ జీవనం, ఆహారం-వ్యాయామం మనం వీరి నుండి నేర్చుకోవాల్సినవి. అంబేద్కర్ వ్యక్తిత్వంలోని బల పార్శ్వాలను, రస్సెల్ జీవితంలోని హేతువాద దృక్పథాన్ని, వార్డ్స్‌వర్త్ ప్రకృతి వర్ణనలను, కవిత్వాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సమున్నతమైన ఉత్తేజకరమైన విశేషాలను జీవన ఘట్టాల ఆధారంగా మనకి అందించారు రచయిత.
- భవిష్య
No comments:
Post a Comment