అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడంతోనే సరిపోదని, వారి ఆస్తులనూ జప్తు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. సిపిఎం డివిజన్ కార్యదర్శి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో బివి.రాఘవులు మాట్లాడారు. గాలి జనార్థన్‌రెడ్డి బళ్లారిలో ఐదేళ్ల పాటు పదవిలో ఉండి రూ.20 వేల కోట్లకు పైగా దోచుకున్నారని విమర్శించారు. ఇలాంటి వారిని అరెస్టు చేయడంతోనే సమస్య పరిష్కారం కాదని జైళ్లో పెట్టినా అక్కడ సెల్‌ఫోన్‌లు, బిర్యానీ అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. అరెస్టు చేయడంతోపాటు ఆస్తులన్నింటినీ ప్రభుత్వం జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని లూఠీ చేయడం తప్ప కాంగ్రెస్ వారికి ప్రజాసమస్యలను పరిష్కరించడం కాని, అభివృద్ధి చేయడం కాని పట్టదన్నారు. కేంద్రంలో ఓ మంత్రి లక్షన్నర కోట్ల రూపాయలు లూఠీ చేశారని చెప్పారు. మరో మంత్రి క్రీడల పేరుతో రూ.70వేల కోట్లు స్వాహా చేశారన్నారు. ఈ డబ్బులో పదివేల కోట్ల రూపాయలను ఖర్చు పెడితే నిత్యం కరువు కాటకాలకు గురయ్యే కర్నూలు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చన్నారు.

ReplyDelete