ఊటీ తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం.ఉదక మండలాన్ని ‘‘ఊటీ’’ అని పిలుస్తారు. ఉదక మండల మంటే నీరు గల ప్రదేశం. సముద్ర
మట్టానికి ఎత్తులో 2,719 మీ (8,921 అడుగులు)ఉన్న ఈ ప్రదేశం లో ఎప్పుడూ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది మంచి
వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. ఊటీ పచ్చని ప్రకృతికి ఆలవాలం. అందరినీ ఆకట్టుకునే
పర్యాటక ప్రాంతం. నిజం గా జీవితం లో ఒక్క సారి ఐనా చూసి తీరవలసిన ప్రదేశం ఇది. ఈ పచ్చ బంగారు లోకం నిలువెల్ల ఓ
అద్భుత దృశ్య కావ్యమే. వేసవి లోనే కాదు ఏ కాలం లూ ఐనా ఇక్కడ పచతి ప్రకృతి
వడిలో విశ్రాంతి తీసుకోవచు. నవ దంపతుల నుంచి వయో వ్రుదుల వరకు ఎవరినా
ఇక్కడి అందాలకు పరవశించి పోతారు. నీలగిరికొండలు చల్లదనానికి
మారుపేరు. అందమైన తోటలు, రంగురంగుల పుష్పాలు, టీ, కాఫీ తోటలు, ఎత్తయిన
కొండలు, పొడుగైన పైన్ వృక్షాలు వంటి ప్రకృతి సహజ సౌందర్యానికి పేరుగాంచిన
ప్రదేశం.వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది
పర్యాటకులు విచ్చేస్తుంటారు.
ఊటీ మనకు తెలిసిన ప్రాంతంలా అనిపించడానికి కారణం మన సినిమాలే. ముఖ్యంగా కథానాయకుడు, నాయిక అక్కడి సరస్సులో విహరిస్తూ డ్యూయెట్లు పాడుకోవడం అందరికీ సుపరిచితం.
ఊటీ చరిత్ర
పూర్వం నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తర్వాత గంగరాజులు, 12వ శతాబ్దంలో హొయసాలుల వంశరాజైన విష్ణువర్థనుడి సామ్రాజ్యంలో భాగమయ్యాయి. చివరిగా టిప్పుసుల్తాన్ అధీనంలోకి, ఆ తర్వాత 18వ శతాబ్దంలో తెల్లవారి సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి.
ఆంగ్లేయుల కాలంలోనే కోయంబత్తూర్ ప్రావిన్స్ గవర్నర్‌గా పనిచేసిన జాన్ సుల్లివాన్ నీలగిరి పర్వత శ్రేణుల్లోని ఊటీ వాతావరణానికి, అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. వెంటనే అక్కడ నివసిస్తున్న కోయజాతి ప్రజలకు అతి తక్కువ పైకం ముట్టజెప్పి ఆ ప్రాంతాన్ని కొనేశాడు. అలా ఊటీ ప్రాంతంలోని స్థలాలన్నీ చిన్నగా ఆంగ్లేయులపరం అయ్యాయి. వారే ఆ ప్రాంతాల్ని అభివృద్ధి చేశారు.
ఆ తర్వాత మద్రాసుకి ఊటీ వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఊటీలో ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాన్ని నిర్మించారు. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయల సౌందర్యానికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలిచేవారు.
ఊటీ కి దారులు
ఊటీ వెళ్ళాలంటే చెన్నై సెంట్రల్ స్టేషన్ లో ప్రతి రోజు రాత్రి ఖచితం గా తోమ్మిది గంటలకు బయలు దేరే మేట్టుపలియం రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఆ రైలు మరుసటి రోజు ఉదయం ఆరుంబావు కి మేట్టుపలియం చేరుతుంది. చిన్న గా ఉండే ఈ స్టేషన్ నుంచి ప్రతి గంటకు అరకు వెళ్ళే నీలగిరి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ రైలు ఊటీ కి చేరే సరికి పన్నెండున్నర అవుతుంది.
ఊటీ లో విహారం .వుహాలోకానికి ప్రయాణం
ఊటీలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంటు మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్, కాఫీ తోటలు, మురుగన్ కోయిల్, వెంకటేశ్వరస్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఇక్కడ మే నెలలో జరిగే ఫ్లవర్ షో, ఫ్రూట్ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి.
ఊటీ పరిసర ప్రాంతాల్లో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్‌బాక్ డాన్స్, వెక్ హిల్స్, స్నో డెక్ పీక్, కూనూరు, డాల్ఫిన్స్ నోన్, లాంబ్స్ రాక్, లాన్ ఫాల్స్, సెయింట్ కేథరిన్ ఫాల్స్, సిమ్స్ పార్క్, కోటగిరి, కొడనాడ్ పాయింట్ కూడా చూడాల్సిన ప్రదేశాలే.
ఊటీ వెళ్ళినప్పుడు తప్పకుండా చేయవలసిన పని ఇది. ఊటీ నుండి కూనూరుకు వెళ్ళటానికి ఒక ఒక రైలు బండి ఉంటుంది. ఎప్పుడో బ్రిటీషువాళ్ళ కాలంలో వేసిన పట్టాల మీద, దాదాపు అంతే పాతదయిన రైలు తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం పర్యాటకుల కోసమే తిరిగే రైలు. మెల్లగా ఒక మనిషి పరిగెత్తేటంత వేగంతో వెళ్తూ 20 కిమీల దూరాన్ని 2 గంటలలో తీసుకుని వెళ్తుంది. అలా మెల్లగా తీసుకుని వెళ్ళటం వలన దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలను మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ రౌలు ప్రయాణంలోనే మేము దాదాపు 100 ఫొటోలు దాకా తీసుకున్నాము. మద్య్హలో రెండు మూడు సొరంగమార్గాలు, ఇరువైపులా అందమయిన లోయలతో ప్రయానిస్తున్నంత సేపు, చాలా మంచి అనుభూతిని పొందవచ్చు
థ్రెడ్ గార్డెన్
థ్రెడ్ గార్డెన్ లోనికి అడుగుపెట్టగానే రంగురంగుల పువ్వులు, చూడచక్కని క్రోటన్లు చూపరుల మనసును మురిపిస్తాయి. దేనికదే విభిన్నంగా, వినూత్నంగా ఉండటమే అక్కడి పుష్పాల ప్రత్యేకత. వీక్షకుల మనసును విహరింపచేయడమే అక్కడి విశేషం.మనం ఊహించలేనన్ని రకాలు అక్కడ కళ్లముందు నిలిచి మైమరపిస్తాయి. లతలు, తీగలు, లాన్లు, కలువల కొలను, సీతాకోకచిలుకలు, పక్షులు... అందరినీ అచ్చెరువుగొల్పుతాయి. అంత నునులేత చెక్కిళ్లవంటి సున్నితమైన పుష్పాలను చూడగానే తాకాలని అనుకోని వారుంటారా? పువ్వులు చూసి తెంపబోవడం, ఆకులు తుంచాలనుకోవడం, లాన్లో కూర్చోవాలనుకోవడం, కనిపించే కలువలను అందుకోవాలనుకోవడం, తీగలను లాగాలని ప్రయత్నించడం అక్కడ అతి మామూలు విషయం. తీరా వాటిని తాకితే ఎవరైనా సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టులవ్వాల్సిందే! అవేమీ నిజమైన పువ్వులు కాదు, ప్లాస్టిక్ పువ్వులు అంతకన్నా కాదు. అవి కాన్వాస్ కాగితాలను ఆకారాలుగా మలిచి, వాటిపై ఆయా రంగుల దారాలు చుట్టగా వచ్చిన రూపాలు. రంగుల మేళవింపులన్నీ ఆయా వర్ణపు దారాలే!
పుట్టినిల్లు కేరళ
ప్రకృతికి పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ఈ కళ పుట్టింది. ఈ సృష్టివెనుక ఒక వ్యక్తి ఉన్నారు. ఈ కృషి వెనుక 50 మంది మహిళలున్నారు. ఆ కష్టం విలువ 12 సంవత్సరాలు. ఇక కనిపించనవి సృజన, నేర్పు, ఓర్పు. ఆంథోనీ జోసెఫ్ దీనంతటివెనుకా ఉన్న శక్తి. సృష్టిలో కనిపించే పూలకు పునఃసృష్టి రూపకల్పన జరిగింది మహిళల చేతులతోనే. ఆంథోనీ జోసెఫ్ కామర్స్ లెక్చరర్. ఆయనకు కళాభిరుచి ఎక్కువ. ఒకరోజు ఆయన ప్రకృతికి సరిసాటిగా నిలిచే పుష్పాలను తయారుచేయలేమా అనుకున్నారు. అందుకు అనేకమంది మహిళలను సంప్రదించారు. ఆయన మనసులో తట్టిన ఆలోచనను ఆ ప్రాంత మహిళలంతా అందిపుచ్చుకున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్న నిర్ణయాన్ని సవాలుగా తీసుకున్నారు. అల్లికల ప్రావీణ్యాన్ని పరిపూర్ణం అనుకున్నంతవరకూ కష్టించారు. అనేకానేక ప్రయోగాలు చేశారు. తాము అల్లినవి నిజంపూలని నమ్మకం కలిగేంతవరకూ శ్రమించారు. సుమాలు లలితలలితంగా కనిపించేలా తీర్చిదిద్దారు. తరువాతే ఈ అద్భుత సృష్టిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది అనుకున్నంత సులువు కాదు. వర్ణపట్టకంనుండి రంగుల ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతిని రప్పించడానికి... కనీవినని ఇంద్రధనస్సులు వెల్లివిరిసిన భావంతో అబ్బురపరచడానికి... మంత్రముగ్థులను చేయడానికి... వారు పడ్డది మామూలు కష్టంకాదు. తల్లి బిడ్డను ప్రసవించినంత ఓర్పు, నేర్పు దీనివెనుక దాగుంది. ఈరకం ఎంబ్రాయిడరీని 'ఫోర్ డైమన్షెనల్ హ్యాండ్-వూండ్ ఎంబ్రాయిడరీ' అంటారు.
ఈ పూదోట అల్లికకు ఉపయోగించిన దారం 6 కోట్ల మీటర్లు. సుమారు 400 కన్నా ఎక్కువ షేడ్లు ఆ పువ్వుల్లో, ఆకుల్లో కనిపిస్తాయి. సూది, మిషన్లు వాడకుండా కేవలం చేతులతోనే తయారుచేయడం విశేషం. డిజైన్లు, రంగులు, షేడ్లు అన్నీ ప్రకృతిలో కొలువుతీరినవే. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే దారాల అల్లికల మధ్య ఎక్కడా ఒక దారంమీద మరో దారం రాదు. ముడులు పొరపాటున కూడా పడలేదు. దారాలకు మధ్య కాస్తయినా దూరాలు ఉండవు.
మెట్టినిల్లు ఊటీ
తయారుచేసిన పుష్పాలను అన్నింటినీ ప్రదర్శించడానికి జోసెఫ్ ఊటీని మించిన వేదిక లేదనుకున్నారు. అందుకే వీటిని ఊటీకి తరలించారు. సందర్శకులకోసం ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఇప్పుడవి దేశ, విదేశీ పర్యాటకులను పట్టి లాగుతున్నాయి.
అక్కడ ప్రతి పువ్వుకీ దేని ప్రత్యేకత దానిదే. రంగుల మేళవింపులోనూ అంతే! మదిని ఆకట్టుకోని పుష్పం ఉండదు. పూబాలలంతా ఒకచోట చేరి ముచ్చటగా ఊసులాడుకుంటున్న దృశ్యం మరపుకురాదు. పుష్పసముదాయం మన జ్ఞాపకాలనుండి ఓపట్టాన మసకబారదు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి పుష్ప ప్రదర్శనలు లేకపోవడం విశేషం. ''ఈ సుమబాలలను అందరూ తాకితే తొందరగా పాడయిపోతాయి. కనుక అన్నింటినీ తాకనివ్వర. శాంపిల్స్‌మాత్రం చూడనిస్తార. వీటన్నింటినీ తేమ, వేడి, ఎండ, దుమ్ము సోకకుండా అతి భద్రంగా చూసుకుంటాం. అప్పుడే కదా కలకాలం నిలిచేది'' అంటుంది ఊటీలో ఆ పుష్పాల గురించి వివరించే కోకిల.
''అనేకమంది ఈ పుష్పాలను తమ ఇంట్లోనూ ఉంచుకోవాలని ఆశపడతారు. అందుకోసం మేమిక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. ఆ పూలకుండీలకు దుమ్ము సోకకుండా గ్లాస్ బాక్సుల్లో ఉంచి అమ్ముతారు. కొనుక్కున్న ప్రతివారికీ చంటిబిడ్డను అందిస్తున్నన్ని జాగ్రత్తలు సూచిస్తారు. మా కష్టం వారింట్లో పదిలంగా పదికాలాలు ఉండాలనే ఆ శ్రద్ధ తీసుకుంటాం'' అంటోంది మాయావతి.
కేరళలోని ఒక వ్యక్తి మనసులో సుడిగాలిలా మెదిలిన ఆలోచన నేడు ఎందరో మహిళలకు జీవనాధారంగా మారింది. వారి కష్టంతాలూకు పుష్పాలు ఊటీలో వెల్లివిరిశాయి. ఈ మిలీనియం మిరాకిల్ అని ఊటీ పర్యాటకులచేత ప్రశంసలు అందుకుంటున్న మహిళలదే ఈ ఘనతంతా. వారి నైపుణ్యానికే పేరంతా. నిజానికి ఇదొక కళ. వారంతా కళాకారులు. ఇప్పుడు వారు తమ కష్టాన్నంతా మరిచిపోయారు. అందివచ్చిన విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. ఊహల్లో తేలియాడి వాస్తవాలుగా నిలిచిన పూదోటను చూసి మురిసిపోతున్నారు. మహిళల్లో దాగుండే నిరుపమాన ప్రతిభకు, నిబిడీకృతమైన అద్వితీయ శక్తికి ఇదో నిదర్శనం. ప్రోత్సహించి అండగా నిలిస్తే మహిళ సాధించలేనిదంటూ ఏమీలేదనడానికి ఇదో తార్కాణం. "బొటానికల్ గార్డెన్"
"బొటానికల్ గార్డెన్" గురించి చెప్పుకోవాలంటే.. ఇది ఊటీ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 1847లో మార్క్విస్ చేత ప్రారంభించబడింది. అద్భుతమైన పూల మొక్కలు, అరుదైన పుష్ప జాతులను ఇక్కడ చూడవచ్చు. మే నెలలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ బొటానికల్ గార్డెన్లో 20 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా దర్శించాల్సిందే.
అలాగే ఊటీకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండే "లేక్" చూడదగ్గది. ఇది 1824లో కోయంబత్తూర్ కలెక్టర్ జాన్ సిలివాస్ చేత నిర్మించబడింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఈ లేక్‌లో ఎంచక్కా బోటింగ్ చేయవచ్చు. ఇక్కడ చిన్నారుల కోసం చిల్డ్రన్స్ కార్నర్ కూడా ఉంది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ మ్యూజియం. మైసూర్ రోడ్డులో ఉన్న ఈ మ్యూజియంలో పాతకాలంనాటి అనేక వస్తువులను చూడవచ్చు.
ఊటీ పరిసర ప్రాంతంలో ఉన్న "కెట్టివ్యాలి వ్యూ" తప్పకుండా చూడాల్సిందే. ఇది కూనూరు వెళ్లే దారిలో ఉంది. కోయంబత్తూర్, మైసూర్ మైదానాలలో ఉండే చిన్న గ్రామాలన్నింటినీ చూడవచ్చు. ఆ తరువాత ఊటీకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న "పైకరా" చూడాల్సిన మరో ప్రదేశం. ఇది మైసూర్ రోడ్లో ఉంది. ఇక్కడ రిజర్వాయర్, డ్యామ్ చూడదగ్గవి.
అలాగే "అప్పర్ భవాని" అనే ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇది కోరాకుందా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అవలంచి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిశ్శబ్దలోయ చూడదగ్గది. ఊటికి 28 కిలోమీటర్ల దూరంలోని "అవలంచి" చూడదగ్గ మరో ప్రదేశం. ఇక్కడ సుందరమైన సరస్సు, చుట్టూ అడవితో పర్యాటకులకు స్వర్గాన్ని తలపిస్తుంది.
నీలగిరి కొండల్లోని ఊటీ సమీపంలో ఉన్న దొడ్డబెట్ట (2637 మీ) అతి ఎత్తైనా శిఖరం.
అక్కడ నెలవైన టెలిస్కోపుతో నీలగిరి అందాల వీక్షణ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఇంకా జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏనుగులు, పులులు, జింకలు, నీటి పక్షులు, కొండ చిలువలను చూడవచ్చు. టేకు చెట్లు అధికంగా ఉండే ఈ శాంక్చురీకి దగ్గర్లోని మోయర్ జలపాతం, ముఖ్యమంత్రి గడియార స్తంభం చూడదగ్గవి.
ఊటీ లో . చలికాలంలో 21 డిగ్రీల సెంటీగ్రేడ్, వేసవిలో 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో ఊటీ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలు ఊటీ సందర్శనకు అనుకూలమైన నెలలు. కోయంబత్తూరు నుంచి రైల్లో ఊటికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కూడా ఊటీకి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుంచి పలు రోడ్డు మార్గాలలో ఊటీ చేరుకోవచ్చు.

| Ooty is connected by good roads. To Madras 535 Kms. (Via Salem) To Coimbatore 89 Kms To Coonoor 18 Kms. (Via Gudalur) To Mysore 160 Kms. To Calicut 187 Kms. To Bangalore 290 Kms. To Cochin 281 Kms. (Via Coimbatore, Palakkad) To Trichy 302 Kms. (Via Coimbatore, Karur) To Kodaikanal 256 (Via Coimbatore, Palani) |
||
Local Transport: CityBus, Taxi and Auto available | ||
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Mountain Railway
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
(Subject to change)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Fare :- First Class Rs. 70.00. Second Class Rs 9.00. |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Ooty- Coonoor : 09.30 a.m. / 02.55 p.m. / 06.00 p.m.
Coonoor - Ooty : 08.00 a.m. / 11.00 a.m. / 03.00 p.m. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఊటీ లో విహారం .వుహాలోకానికి ప్రయాణం
ఊటీలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంటు మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్, కాఫీ తోటలు, మురుగన్ కోయిల్, వెంకటేశ్వరస్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఇక్కడ మే నెలలో జరిగే ఫ్లవర్ షో, ఫ్రూట్ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి.
ఊటీ పరిసర ప్రాంతాల్లో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్‌బాక్ డాన్స్, వెక్ హిల్స్, స్నో డెక్ పీక్, కూనూరు, డాల్ఫిన్స్ నోన్, లాంబ్స్ రాక్, లాన్ ఫాల్స్, సెయింట్ కేథరిన్ ఫాల్స్, సిమ్స్ పార్క్, కోటగిరి, కొడనాడ్ పాయింట్ కూడా చూడాల్సిన ప్రదేశాలే.
ఊటీ వెళ్ళినప్పుడు తప్పకుండా చేయవలసిన పని ఇది. ఊటీ నుండి కూనూరుకు వెళ్ళటానికి ఒక ఒక రైలు బండి ఉంటుంది. ఎప్పుడో బ్రిటీషువాళ్ళ కాలంలో వేసిన పట్టాల మీద, దాదాపు అంతే పాతదయిన రైలు తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం పర్యాటకుల కోసమే తిరిగే రైలు. మెల్లగా ఒక మనిషి పరిగెత్తేటంత వేగంతో వెళ్తూ 20 కిమీల దూరాన్ని 2 గంటలలో తీసుకుని వెళ్తుంది. అలా మెల్లగా తీసుకుని వెళ్ళటం వలన దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలను మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ రౌలు ప్రయాణంలోనే మేము దాదాపు 100 ఫొటోలు దాకా తీసుకున్నాము. మద్య్హలో రెండు మూడు సొరంగమార్గాలు, ఇరువైపులా అందమయిన లోయలతో ప్రయానిస్తున్నంత సేపు, చాలా మంచి అనుభూతిని పొందవచ్చు
థ్రెడ్ గార్డెన్
థ్రెడ్ గార్డెన్ లోనికి అడుగుపెట్టగానే రంగురంగుల పువ్వులు, చూడచక్కని క్రోటన్లు చూపరుల మనసును మురిపిస్తాయి. దేనికదే విభిన్నంగా, వినూత్నంగా ఉండటమే అక్కడి పుష్పాల ప్రత్యేకత. వీక్షకుల మనసును విహరింపచేయడమే అక్కడి విశేషం.మనం ఊహించలేనన్ని రకాలు అక్కడ కళ్లముందు నిలిచి మైమరపిస్తాయి. లతలు, తీగలు, లాన్లు, కలువల కొలను, సీతాకోకచిలుకలు, పక్షులు... అందరినీ అచ్చెరువుగొల్పుతాయి. అంత నునులేత చెక్కిళ్లవంటి సున్నితమైన పుష్పాలను చూడగానే తాకాలని అనుకోని వారుంటారా? పువ్వులు చూసి తెంపబోవడం, ఆకులు తుంచాలనుకోవడం, లాన్లో కూర్చోవాలనుకోవడం, కనిపించే కలువలను అందుకోవాలనుకోవడం, తీగలను లాగాలని ప్రయత్నించడం అక్కడ అతి మామూలు విషయం. తీరా వాటిని తాకితే ఎవరైనా సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టులవ్వాల్సిందే! అవేమీ నిజమైన పువ్వులు కాదు, ప్లాస్టిక్ పువ్వులు అంతకన్నా కాదు. అవి కాన్వాస్ కాగితాలను ఆకారాలుగా మలిచి, వాటిపై ఆయా రంగుల దారాలు చుట్టగా వచ్చిన రూపాలు. రంగుల మేళవింపులన్నీ ఆయా వర్ణపు దారాలే!
పుట్టినిల్లు కేరళ
ప్రకృతికి పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ఈ కళ పుట్టింది. ఈ సృష్టివెనుక ఒక వ్యక్తి ఉన్నారు. ఈ కృషి వెనుక 50 మంది మహిళలున్నారు. ఆ కష్టం విలువ 12 సంవత్సరాలు. ఇక కనిపించనవి సృజన, నేర్పు, ఓర్పు. ఆంథోనీ జోసెఫ్ దీనంతటివెనుకా ఉన్న శక్తి. సృష్టిలో కనిపించే పూలకు పునఃసృష్టి రూపకల్పన జరిగింది మహిళల చేతులతోనే. ఆంథోనీ జోసెఫ్ కామర్స్ లెక్చరర్. ఆయనకు కళాభిరుచి ఎక్కువ. ఒకరోజు ఆయన ప్రకృతికి సరిసాటిగా నిలిచే పుష్పాలను తయారుచేయలేమా అనుకున్నారు. అందుకు అనేకమంది మహిళలను సంప్రదించారు. ఆయన మనసులో తట్టిన ఆలోచనను ఆ ప్రాంత మహిళలంతా అందిపుచ్చుకున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్న నిర్ణయాన్ని సవాలుగా తీసుకున్నారు. అల్లికల ప్రావీణ్యాన్ని పరిపూర్ణం అనుకున్నంతవరకూ కష్టించారు. అనేకానేక ప్రయోగాలు చేశారు. తాము అల్లినవి నిజంపూలని నమ్మకం కలిగేంతవరకూ శ్రమించారు. సుమాలు లలితలలితంగా కనిపించేలా తీర్చిదిద్దారు. తరువాతే ఈ అద్భుత సృష్టిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది అనుకున్నంత సులువు కాదు. వర్ణపట్టకంనుండి రంగుల ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతిని రప్పించడానికి... కనీవినని ఇంద్రధనస్సులు వెల్లివిరిసిన భావంతో అబ్బురపరచడానికి... మంత్రముగ్థులను చేయడానికి... వారు పడ్డది మామూలు కష్టంకాదు. తల్లి బిడ్డను ప్రసవించినంత ఓర్పు, నేర్పు దీనివెనుక దాగుంది. ఈరకం ఎంబ్రాయిడరీని 'ఫోర్ డైమన్షెనల్ హ్యాండ్-వూండ్ ఎంబ్రాయిడరీ' అంటారు.
ఈ పూదోట అల్లికకు ఉపయోగించిన దారం 6 కోట్ల మీటర్లు. సుమారు 400 కన్నా ఎక్కువ షేడ్లు ఆ పువ్వుల్లో, ఆకుల్లో కనిపిస్తాయి. సూది, మిషన్లు వాడకుండా కేవలం చేతులతోనే తయారుచేయడం విశేషం. డిజైన్లు, రంగులు, షేడ్లు అన్నీ ప్రకృతిలో కొలువుతీరినవే. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే దారాల అల్లికల మధ్య ఎక్కడా ఒక దారంమీద మరో దారం రాదు. ముడులు పొరపాటున కూడా పడలేదు. దారాలకు మధ్య కాస్తయినా దూరాలు ఉండవు.
మెట్టినిల్లు ఊటీ
తయారుచేసిన పుష్పాలను అన్నింటినీ ప్రదర్శించడానికి జోసెఫ్ ఊటీని మించిన వేదిక లేదనుకున్నారు. అందుకే వీటిని ఊటీకి తరలించారు. సందర్శకులకోసం ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఇప్పుడవి దేశ, విదేశీ పర్యాటకులను పట్టి లాగుతున్నాయి.
అక్కడ ప్రతి పువ్వుకీ దేని ప్రత్యేకత దానిదే. రంగుల మేళవింపులోనూ అంతే! మదిని ఆకట్టుకోని పుష్పం ఉండదు. పూబాలలంతా ఒకచోట చేరి ముచ్చటగా ఊసులాడుకుంటున్న దృశ్యం మరపుకురాదు. పుష్పసముదాయం మన జ్ఞాపకాలనుండి ఓపట్టాన మసకబారదు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి పుష్ప ప్రదర్శనలు లేకపోవడం విశేషం. ''ఈ సుమబాలలను అందరూ తాకితే తొందరగా పాడయిపోతాయి. కనుక అన్నింటినీ తాకనివ్వర. శాంపిల్స్‌మాత్రం చూడనిస్తార. వీటన్నింటినీ తేమ, వేడి, ఎండ, దుమ్ము సోకకుండా అతి భద్రంగా చూసుకుంటాం. అప్పుడే కదా కలకాలం నిలిచేది'' అంటుంది ఊటీలో ఆ పుష్పాల గురించి వివరించే కోకిల.
''అనేకమంది ఈ పుష్పాలను తమ ఇంట్లోనూ ఉంచుకోవాలని ఆశపడతారు. అందుకోసం మేమిక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. ఆ పూలకుండీలకు దుమ్ము సోకకుండా గ్లాస్ బాక్సుల్లో ఉంచి అమ్ముతారు. కొనుక్కున్న ప్రతివారికీ చంటిబిడ్డను అందిస్తున్నన్ని జాగ్రత్తలు సూచిస్తారు. మా కష్టం వారింట్లో పదిలంగా పదికాలాలు ఉండాలనే ఆ శ్రద్ధ తీసుకుంటాం'' అంటోంది మాయావతి.
కేరళలోని ఒక వ్యక్తి మనసులో సుడిగాలిలా మెదిలిన ఆలోచన నేడు ఎందరో మహిళలకు జీవనాధారంగా మారింది. వారి కష్టంతాలూకు పుష్పాలు ఊటీలో వెల్లివిరిశాయి. ఈ మిలీనియం మిరాకిల్ అని ఊటీ పర్యాటకులచేత ప్రశంసలు అందుకుంటున్న మహిళలదే ఈ ఘనతంతా. వారి నైపుణ్యానికే పేరంతా. నిజానికి ఇదొక కళ. వారంతా కళాకారులు. ఇప్పుడు వారు తమ కష్టాన్నంతా మరిచిపోయారు. అందివచ్చిన విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. ఊహల్లో తేలియాడి వాస్తవాలుగా నిలిచిన పూదోటను చూసి మురిసిపోతున్నారు. మహిళల్లో దాగుండే నిరుపమాన ప్రతిభకు, నిబిడీకృతమైన అద్వితీయ శక్తికి ఇదో నిదర్శనం. ప్రోత్సహించి అండగా నిలిస్తే మహిళ సాధించలేనిదంటూ ఏమీలేదనడానికి ఇదో తార్కాణం. "బొటానికల్ గార్డెన్"
"బొటానికల్ గార్డెన్" గురించి చెప్పుకోవాలంటే.. ఇది ఊటీ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 1847లో మార్క్విస్ చేత ప్రారంభించబడింది. అద్భుతమైన పూల మొక్కలు, అరుదైన పుష్ప జాతులను ఇక్కడ చూడవచ్చు. మే నెలలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ బొటానికల్ గార్డెన్లో 20 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా దర్శించాల్సిందే.
అలాగే ఊటీకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండే "లేక్" చూడదగ్గది. ఇది 1824లో కోయంబత్తూర్ కలెక్టర్ జాన్ సిలివాస్ చేత నిర్మించబడింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఈ లేక్‌లో ఎంచక్కా బోటింగ్ చేయవచ్చు. ఇక్కడ చిన్నారుల కోసం చిల్డ్రన్స్ కార్నర్ కూడా ఉంది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ మ్యూజియం. మైసూర్ రోడ్డులో ఉన్న ఈ మ్యూజియంలో పాతకాలంనాటి అనేక వస్తువులను చూడవచ్చు.
ఊటీ పరిసర ప్రాంతంలో ఉన్న "కెట్టివ్యాలి వ్యూ" తప్పకుండా చూడాల్సిందే. ఇది కూనూరు వెళ్లే దారిలో ఉంది. కోయంబత్తూర్, మైసూర్ మైదానాలలో ఉండే చిన్న గ్రామాలన్నింటినీ చూడవచ్చు. ఆ తరువాత ఊటీకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న "పైకరా" చూడాల్సిన మరో ప్రదేశం. ఇది మైసూర్ రోడ్లో ఉంది. ఇక్కడ రిజర్వాయర్, డ్యామ్ చూడదగ్గవి.
అలాగే "అప్పర్ భవాని" అనే ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇది కోరాకుందా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అవలంచి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిశ్శబ్దలోయ చూడదగ్గది. ఊటికి 28 కిలోమీటర్ల దూరంలోని "అవలంచి" చూడదగ్గ మరో ప్రదేశం. ఇక్కడ సుందరమైన సరస్సు, చుట్టూ అడవితో పర్యాటకులకు స్వర్గాన్ని తలపిస్తుంది.
నీలగిరి కొండల్లోని ఊటీ సమీపంలో ఉన్న దొడ్డబెట్ట (2637 మీ) అతి ఎత్తైనా శిఖరం.
అక్కడ నెలవైన టెలిస్కోపుతో నీలగిరి అందాల వీక్షణ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఇంకా జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏనుగులు, పులులు, జింకలు, నీటి పక్షులు, కొండ చిలువలను చూడవచ్చు. టేకు చెట్లు అధికంగా ఉండే ఈ శాంక్చురీకి దగ్గర్లోని మోయర్ జలపాతం, ముఖ్యమంత్రి గడియార స్తంభం చూడదగ్గవి.
ఊటీ లో . చలికాలంలో 21 డిగ్రీల సెంటీగ్రేడ్, వేసవిలో 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో ఊటీ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలు ఊటీ సందర్శనకు అనుకూలమైన నెలలు. కోయంబత్తూరు నుంచి రైల్లో ఊటికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కూడా ఊటీకి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుంచి పలు రోడ్డు మార్గాలలో ఊటీ చేరుకోవచ్చు.

No comments:
Post a Comment